వైసీపీ ఎమ్మెల్యేకు ఓ మహిళ షాకిచ్చింది. “ చంద్రబాబు కన్నా.. మీరుఎక్కువేం చేస్తున్నారు. అప్పట్లో ఆయనే 2000 రూపాయ లు పింఛన్‌గా ఇచ్చారు. ఇప్పుడు మీరు ఎంత ఎక్కువిస్తున్నారు? ఇదేనా మీరు పెంచింది“ అని ప్రశ్నించింది.
కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి.. తాజాగా తన నియోజకవర్గంలో గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యకరమంలో ఓ మహిళ షాక్ ఇచ్చింది. పింఛన్ సరిపోవడం లేదని ఎమ్మెల్యేను… చిన్నిబాయి అనే మహిళా వృద్ధురాలు మొరపెట్టుకుంది.
దీంతో ఎమ్మెల్యే సాయిప్రసాద్.. స్పందిస్తూ.. టీడీపీ ప్రభుత్వం కంటే వైసీపీ హయాంలోనే ఎక్కువ పింఛన్ ఇస్తున్నామని అన్నారు. దీనికి సంబంధించి కొన్ని లెక్కలు కూడా చెప్పారు. దీంతో ఏ మాత్రం తడుముకోని మహిళ.. చంద్రబాబు ఉన్నప్పుడే 2వేలు పింఛన్ ఇచ్చారని.. ఇప్పుడు మీరు పెంచింది.. పెంచిన ధరలకు కూడా సరిపోదన్నారు. దీంతో సదరు ఎమ్మెల్యే సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఏం జరిగిందంటే..
కర్నూలు జిల్లా ఆదోనిలో ‘గడప గడప’ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని 1వ వార్డులో ఓ వృద్ధురాలికి ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వివరించారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ సరిపోవడం లేదని చిన్ని భాయ్ అనే వృద్ధురాలు ఎమ్మెల్యే వద్ద ఆవేదన వ్యక్తం చేసింది.
గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఎక్కువ ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. మరోవైపు.. ఎల్కేజీ విద్యార్థి తన్విష్ లాప్ టాప్ ఎప్పుడీస్తారని ఎమ్మెల్యేను ప్రశ్నించాడు. నవ్వుతూ నీవు పెద్దగా అవ్వు … అప్పుడు ఇస్తానని ఎమ్మెల్యే చెప్పి వెళ్లిపోయాడు. మొత్తానికి ఈ ఘటనలు వైసీపీలో చర్చనీయాంశంగా మారాయి.