టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో పర్యటించారు. ఇటీవల ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆయన.. వాస్తవానికి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించాలని భావించారు. అయితే..మంత్రి ఆదిమూ లపు సురేష్ చేసిన హల్చల్ కారణంగా చంద్రబాబు మధ్యంలోనే విరమించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా.. గుంటూరు జిల్లాలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మంత్రి ఆదిమూలపు సురేష్‌పై విరుచుకుప డ్డారు. అయితే.. ఈ సమయంలో దాదాపు అరగంట పాటు విద్యుత్ నిలిచిపోవడం కలకలం రేపింది.
అయినా.. చంద్రబాబు సెల్ ఫోన్ల టార్చ్‌లైట్ వెలుతురులో ప్రసంగించారు. స్వయనా రాష్ట్ర మంత్రి తనపై దాడి చేయించారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ దాడిలో తన భద్రతా అధికారికి రాళ్లు తగిలి గాయపడ్డారని వివరించారు. సాక్షాత్తు ఒక మంత్రి ఈ విధంగా చేయిస్తే ప్రభుత్వ కుట్ర కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎస్సీలకు న్యాయం చేసింది టీడీపీనేనని చంద్రబాబు స్పష్టం చేశారు. తొలుత కొంత దూరం చీకట్లో సైతం చంద్రబాబు రోడ్ షో కొనసాగించారు. అనంతరం జైల్‌సింగ్ నగర్ బహిరంగ సభలో పాల్గొన్నారు.
అమరావతిని పూర్తిగా నాశనం చేశారని.. రాజధాని పేరిట మూడు ముక్కలాట ఆడారని చంద్రబాబు ఆరోపించారు. ఈసంద ర్భంగా ప్రజలకు ఎలాంటి రాజధాని కావాలని ప్రశ్నించారు. దీంతో వారంతా అమరావతే కావాలని నినదించారు. మరోవైపు.. ఏపీకి రాజధాని ఏదీ? అని చంద్రబాబు పదేపదే ప్రశ్నించారు. దీనికి ప్రజల నుంచి అమరావతి అనే సమాధానం వచ్చింది. అనంతరం తన ప్రసంగాన్ని చంద్రబాబు కొనసాగిస్తూ.. ప్రజలకు టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా అన్యాయం చేశారని నిప్పులు చెరిగారు.
వైసీపీ పాలనలో రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు రావట్లేదని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వంలో ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోయాయని, జగన్ వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ నాయకులపై దొంగ కేసులు పెడుతున్నారని.. జగన్‌ను నమ్ముకున్న వ్యక్తులు జైలుకు వెళ్లారని అన్నారు. అధికారులు తప్పు చేస్తే జైలుకు వెళ్తారని.. తప్పు చేస్తే ఎవరినీ వదిలిపెట్టనని.. శిక్ష తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు కేవలం ఏడాదే సమయం ఉందని చెప్పారు.
"బాబాయిని వేసి ఆ బురద నాకంటించాలని చూశాడు జగన్." – @ncbn గారు#AbbaiKilledBabai#CBNInPalnadu #PsychoPovaliCycleRavali #JaganPaniAyipoyindhi #IdhemKarmaManaRashtraniki pic.twitter.com/5CTHVd2cr9
— Telugu Desam Party (@JaiTDP) April 26, 2023