రాజకీయాల్లో ఏళ్లకు ఏళ్లు ఇండస్ట్రీ ఉన్నప్పటికీ.. ప్రత్యర్థుల ఎత్తులు ఏ తీరులో ఉంటాయన్న దానిపై అప్రమత్తంగా ఉండాలి. వ్యూహాత్మకంగా వారు విసిరే వలలో అస్సలు చిక్కుకోకూడదు. కానీ.. చంద్రబాబుకు ఉన్న అతి పెద్ద లోపాల్లో ఒకటి తనరాజకీయ ప్రత్యర్తులు విసిరే వలలో ఇట్టే చిక్కుకుపోతుంటారు. ఇలాంటి తీరుతో ఇప్పటికే పలుమార్లు ఆయన ఎదురుదెబ్బలు తిన్నారు.
మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. యువకుడైన జగన్ తో ఆయన పడిన పాట్లు అన్ని ఇన్ని కావు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో జగన్ లాంటి ప్రత్యర్థి ఆయనకు ఇప్పటివరకు ఎదురుకాలేదనే చెప్పాలి. మొదట్లో జగన్ ను సింఫుల్ గా తీసుకున్నట్లుగా కనిపించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో తన మీద తనకున్న కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ గా మారి.. జగన్ చేతికి అధికారాన్ని ఇచ్చేలా చేశారని చెప్పాలి. జగన్ ను తక్కువగా అంచనా వేయటమే ఒక కారణంగా చెప్పొచ్చు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా జగన్ ను అంచనా వేయటంలో బాబు ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. దాదాపు రెండేళ్ల పాటు ఆయనకు తగిలిన వరుస ఎదురుదెబ్బలతో ఆయన ఆత్మవిమర్శ చేసుకునే పరిస్థితి ఎదురైంది. జగన్ తీరును అర్థం చేసుకోవటంతో పాటు.. అందుకు తగ్గట్లుగా తనను తాను ఎలా మార్చుకోవాలన్న దానిపై ఒక నిర్ణయానికి రావటానికి కాస్తంత ఎక్కువ సమయమే పట్టిందని చెప్పాలి. తాను అంచనా వేసినట్లుగా జగన్ అంత సింఫుల్ టాస్కు కాదని.. ఆయన్ను ఎదుర్కోవటం అంత ఈజీ కాదన్న విషయాన్ని గుర్తించిన తర్వాత నుంచి ఆయన ట్రాక్ మారిందనే చెప్పాలి.
తాజాగా సమైక్య ఆంధ్ర వ్యాఖ్య ఏపీ ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల వారి నోటి నుంచి వచ్చినప్పుడు.. ఈ వ్యవహారంపై చంద్రబాబు ఎలా రియాక్టు అవుతారన్న ఉత్కంట పెరిగింది. 2018లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లిన చంద్రబాబు.. తెలంగాణ ప్రజల మైండ్ సెట్ ను అర్థం చేసుకోవటంలో జరిగిన పొరపాటుకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. తాజాగా చూస్తే మాత్రం.. ఆయన అలాంటి తప్పులు చేసేందుకు సిద్ధంగా లేరన్న విషయం స్పష్టమవుతుంది.
తనను ఎంతగా టెంప్టు చేసినప్పటికీ తాను మాత్రం టెంప్టు కాదన్న విషయాన్ని తన మాటలతో స్పష్టం చేశారు చంద్రబాబు. విడిపోయిన ఎనిమిదిన్నరేళ్ల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు కలిసే అంశానికి తమ మద్దతు ఉంటుందన్న సంచలన వ్యాఖ్య చేసిన సజ్జలకు ధీటైన కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన నిధులపై నోరు ఎత్తని వైసీపీ సర్కారు మళ్లీ సమైక్య ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తారా? అంటూ ఫైర్ అయ్యారు.
ఇప్పటికైనా ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే సమైక్య రాష్ట్ర ప్రకటనల్ని ఆపాలని.. రైతుల ఆత్మహత్యలు.. పర్జల సమస్యలకు కారణాల్ని విశ్లేషించాలన్నారు. చంద్రబాబు తాజా వ్యాఖ్యల్ని చూస్తుంటే.. గతంలో మాదిరి తొందరపాటుతో తప్పులు చేసే కన్నా.. కాస్తంత ఆలస్యంగా స్పందించినా.. సూటిగా.. స్పష్టంగా.. ఎలాంటి సందేహాలకు తావు ఇవ్వని రీతిలో రియాక్టు అయిన తీరు చూస్తే.. బాబులో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పక తప్పదు.
రాయలసీమ – కర్నూల్, ఆలూరు, ఎమ్మిగనూరు
గోదావరి – దెందులూరు, ఏలూరు, నిడదవోలు
కోస్తా – పొన్నూరు, బాపట్ల
*సెంటర్ ఏదైనా జన ప్రభంజనం మాత్రం పక్కా* pic.twitter.com/ZUomFbb5pG— Anusha vundavalli (@Anushavundavali) December 11, 2022