పెట్రోల్ డీజిల్ పై బాదేస్తున్న జగన్ రెడ్డి కనీసం రోడ్ల మీద గుంతలు కూడా పూడ్చలేడు.. #ChandrannaBharosa #100YearsOfNTR pic.twitter.com/aHkMvJOyG5
— iTDP Official (@iTDP_Official) June 15, 2022
మహానాడు .. టీడీపీ కి ఎంతో కలిసివచ్చిన కార్యక్రమం.. ఒంగోలు కేంద్రంగా ఈ ఏడాది జరిగిన ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా మరో ప్రభంజనం మొదలయింది. విశాఖ జిల్లా, చోడవరంలో ఇవాళ నిర్వహించిన మినీ మహానాడు అనూహ్య రీతిలో విజయవంతం అయింది. దీంతో తెలుగుదేశం శ్రేణులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు.
మూడ్రోజుల పాటు ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చిన మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. అశేష జనవాహిని తరలివచ్చారు. ఇప్పటికే మహానాడుతో పాటు బాదుడే బాదుడు కార్యక్రమంలో కూడా చంద్రబాబు చండ్ర నిప్పులు కక్కారు. ప్రభుత్వ వైఫల్యాలను వెలుగులోకి తెచ్చారు.
ఆ ప్రభంజనాన్ని మరోసారి సృష్టించే విధంగా విశాఖ తీరాన మళ్లీ ఆయన మరో సారి తన వాగ్బాణాలు సంధించడంతో ఈ కార్యక్రమం మరో తెలుగుదేశం ఆవిర్భావ ఉత్సవాన్ని తలపించే విధంగా ఉంది. చంద్రబాబు భావించిన విధంగానే ఉత్తరాంధ్ర సెంటిమెంట్-కు మరోసారి బలం చేకూర్చే విధంగా కార్యకర్తలూ, శ్రేణులూ తరలివచ్చి, మినీ మహానాడును విజయవంతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..తమ హయంలో చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని కక్షపూరిత ధోరణిలో భాగంగానే వైసీపీ సర్కారు నిలిపివేసిందని మండిపడ్డారు. అధికారంలో ఉండగా అమరావతితో సహా ఇతర ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం గా తాము పనిచేస్తే, నాటి స్ఫూర్తిని కొనసాగించేందుకు వైసీపీ ప్రభుత్వం విముఖత చూపడమే కాకుండా అనేక ప్రజా హిత కార్యక్రమాలకు మంగళం పాడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ రెడ్డి నీ పతనం ప్రారంభం అయ్యింది..#ChandrannaBharosa #100YearsOfNTR pic.twitter.com/y8AasUK8cB
— iTDP Official (@iTDP_Official) June 15, 2022
కష్టాల్లో ఉన్నవారికి టీడీపీ అండగా ఉంటుందని అన్నారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డిని ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ (విశాఖ ప్రాంతాన) ఏ2 పెత్తనం చేస్తున్నాడు ఆయనకేంటి పని ఇక్కడ అంటూ మండిపడ్డారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తే విపక్ష నాయకుల గుండెల్లో నిద్రపోతానని అన్నారు.
కనీసం తట్ట మట్టి కూడా వేయలేని వారు రాజధాని కడతారా అని ప్రశ్నించారు. విశాఖను అడ్మిన్ క్యాపిటల్ చేస్తామని చెప్పి కనీస స్థాయిలో కూడా పనులు చేపట్టలేకపోయారని ఫైర్ అయ్యారు. కిలోమీటరు రోడ్డుకు 150 గుంతలు ఉన్నాయని, వీటిని పూడ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపడం లేదని, అదేవిధంగా సంబంధిత మరమ్మతు పనులకు నిధులు ఇవ్వడం లేదని, ఇలాంటివారేనా 3 రాజధానులు నిర్మిస్తాం అని అంటున్నారు అని ప్రశ్నించారాయన.
చంద్రబాబు ప్రసంగం ఆద్యంతం భావోద్వేగంతో సాగింది. ఉత్తరాంధ్ర ముఖ్య నేతలంతా తరలి రావడంతో ప్రాంగణానికి కొత్త కళ చేకూరింది. ఇవాళ చోడవరం సభ తరువాత గురువారం (జూన్ 16, 2022 ) అనకాపల్లిలో పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్-లతో రివ్యూ మీటింగ్ ఉంటుంది.
????????????#ChandrannaBharosa #100YearsOfNTR pic.twitter.com/RRp9Rj4MhA
— iTDP Official (@iTDP_Official) June 15, 2022
విశాఖ ఎయిర్ పోర్టుకి చేరుకున్న చంద్రబాబు గారు.! #ChandrannaBharosa pic.twitter.com/tWksmOH8kZ
— iTDP Official (@iTDP_Official) June 15, 2022