కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో రైతులతో కలిసి ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భోగి పండగ జరుపుకున్నారు. భోగిమంటలలో జగన్ రెడ్డి సర్కారు తెచ్చిన రైతు వ్యతిరేక జీవో లు మంటలో తగల పెట్టారు. తెల్లవారుజామునే జరిగిన ఈ కార్యక్రమానికి మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రజలంతా అభివృద్ధి చెందాలనే తాను కోరుకున్నానని, తాను చేసిన తప్పు అదే అయితే క్షమించాలని చంద్రబాబునాయుడు అన్నారు. ఏడు వరుస విపత్తులతో రైతులు అల్లాడిపోయారు. చేతికి పంట అందలేదు. అందిన పంటకు గిట్టుబాట ధర లేదు. పంటల బీమా ప్రీమియం చెల్లించకుండానే చెల్లించానని చెప్పి అడ్డంగా దొరికిన దొంగ జగన్ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
జగన్ గుర్తు వచ్చిన ప్రతిదానిపై పన్ను బాదుడే బాదుడు అని…. కుక్కలు పందులపై పన్ను వేశాడంటే జగన్ శాడిజం అర్థం చేసుకోవచ్చన్నారు. అమరావతి ఆపేశాడు. పోలవరం ఆపేశాడు. గిట్టుబాట ధర ఆపేశాడు. రుణమాఫీ ఆపేశాడు… రాష్ట్ర ప్రజల నెత్తిన మోయలేని భారం మోపుతున్నాడు. రేపు ఇదంతా ప్రభుత్వం కట్టాలి. ప్రభుత్వం కట్టాలి అంటే మనపై పన్నులు వేసి వసూలు చేయాల్సిందే ఇంకో మార్గం లేదు అని చంద్రబాబు వివరించారు.
బెట్టింగ్ మంత్రులు, మైనింగ్ మాఫియా, బూతుల మంత్రులు తనను విమర్శిస్తున్నారు…. ఓట్లేసి గెలిపిస్తే రైతుల పొాలాలకు మీటర్లు పెడతారట. మీటర్లు వ్యవసాయ మోటార్లకు కాకుండా మంత్రులకు పెట్టాలని అన్నారు. అప్పుడే ఏ మంత్రి ఎంత దోచుకున్నారో తెలుస్తుందన్నారు.