'తానా'చీరలు పంపిణి

NRI
ఉత్తర అమెరికా తెలుగు సంఘం - తానా అధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా  కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని కప్పట్రాళ్ల గ్రామంలోని తానా స్త్రీ శక్తి భవనంలో 100 మంది మహిళలకు తానా ప్రధాన కార్యదర్శి పొట్లూరి రవి సహకారంతో తానా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ దేవినేని లక్ష్మి, కోఆర్డినేటర్ ముప్పా రాజశేఖర్  చేతుల మీదగా చీరలు మరియు చెతి సంచులు పంపిణి చేసారు.
ఈ సందర్భంగా దేవినేని లక్ష్మి మాట్లాడుతూ సరిగ్గా రెండేళ్ళ క్రిందట తానా స్త్రీ శక్తి భవనం ప్రారంభోత్సవానికి హాజరయ్యానని డీఐజీ ఆకే రవికృష్ణ, తానా ప్రధాన కార్యదర్శి పొట్లూరి రవి ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ కార్యక్రమాల వలన కప్పట్రాళ్ల గ్రామం అభివృద్ధిపథంలో పయనిస్తూ రాష్ట్రంలోనే అందరికీ మార్గదర్శకంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తి కొనసాగిస్తూ ముందుకు వెళ్లాలని తానా సహాయ సహకారాలు ఎప్పుడూ గ్రామానికి ఉంటాయని తెలిపారు. తానా అధ్యక్షుడు జై తాళ్ళూరి, 'సోషల్ రెస్పాన్సిబిలిటీ చైర్ రామ్ చౌదరి' ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాల ద్వారా నిరాశ్రయులకు, వృద్దులకు, మహిళలకు, విద్యార్థులకు, రైతులకు సహాయం అందించినట్లు తెలిపారు. కోఆర్డినేటర్ ముప్పా రాజశేఖర్ మాట్లాడుతూ తానా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుపుకునే కప్పట్రాళ్ల సంబరాలు  సంబరాలు ఈ సంవత్సరం కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా జరపడం లేదని పరిస్థితులు అనుకూలిస్తే కప్పట్రాళ్లలో రాష్ట్ర స్థాయి గ్రామీణ క్రీడా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. కప్పట్రాళ్లకు చెందిన షహీన్ అనే విద్యార్థినిని ఇంటర్మీడియట్ వరకు పొట్లూరి రవి చదివించారని మంచి కాలేజీ లో డిగ్రీ పూర్తి చెయ్యటానికి కూడా పొట్లూరి రవి పూర్తి సహకారం అందిస్తారని  తెలిపారు.
ఈ కార్యక్రమంలో అమిత్, మధు, నారాయణ, మీనాక్షి ఇతర గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.