టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారన్న వార్తలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పిన క్రమంలో….గోరంట్లపై వస్తున్న పుకార్లు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. టీడీపీ ఈ విషయంపై మీడియాతో మాట్లాడేందుకు గోరంట్ల నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే గోరంట్లను బుజ్జగించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే గోరంట్లకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు.
సుమారు అరగంటకు పైగా గోరంట్లతో చంద్రబాబు మాట్లాడారని తెలుస్తోంది. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య పార్టీపరంగా, రాజకీయపరంగా పలు విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చేవారం తాను వచ్చి డైరెక్ట్ గా అన్ని విషయాలు మాట్లాడతానని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. అన్ని విషయాలు సర్దుకుంటాయని బుచ్చయ్యకు చంద్రబాబు హామీ ఇచ్చారని, కానీ, రాజీనామా విషయంలో గోరంట్ల వెనక్కు తగ్గేది లేదని చెప్పినట్లు తెలుస్తోంది.
తనను కించపరచడంతోపాటు తన ఇంటికి వచ్చిన వారిని కూడా దూషిస్తున్నారంటూ చంద్రబాబు దగ్గర గోరంట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పొలిట్‌బ్యూరో, వ్యవస్థాపక సభ్యుడైన తనతో ఇలా దురుసుగా ప్రవర్తించడంపై చంద్రబాబు వద్ద గోరంట్ల తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. సీనియర్లను పార్టీ హైకమాండ్ పట్టించుకోకపోగా అవమానిస్తోందని బుచ్చయ్య తీవ్ర ఆవేదనకు లోనయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన అనుచరులు, అభిమానులు, కార్యకర్తలతో మాట్లాడి ఈ నెల 25న రాజీనామా చేస్తానని కూడా బుచ్చయ్య చెప్పినట్లు తెలుస్తోంది.
మరోవైపు, రాజీనామా వార్తల నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు గోరంట్ల ఇంటికి వస్తున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గోరంట్లను కలిశారు. గోరంట్లతో అన్ని విషయాలను మాట్లాడామని,పార్టీకి బుచ్చయ్య చౌదరి రాజీనామా చేయడం లేదని అచ్చెన్నాయుడు మీడియాకు వెల్లడించారు. ఏమైనా సమస్యలుంటే పార్టీలో అంతర్గతంగా పరిష్కరించుకుంటామని, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకుడు గోరంట్ల అని కొనియాడారు.
Partly Ledu Bokka ledu. Pappu Gaadu Vadi Ayya Ganneru Pappu gadu ledu