ప్రస్తుతం జరుగుతున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ఎన్నికల్లో ఉమెన్ సర్వీసెస్ కో ఆర్డినేటర్(2021-23) పదవికి పోటీ చేస్తున్నారు.. చాందిని దువ్వూరి. సుదీర్ఘ కాలంగా తానాతో ప్రత్యేక అనుబంధాన్ని పెనవేసుకున్న చాందిని దువ్వూరి.. ఇటు తానా అభ్యున్నతికి అదేసమయంలో ఒక మహిళగా.. సమాజం లోని మహిళల అభివృద్ధి, సాథికారతకు విశేష కృషి సల్పుతున్నారు. అనేక రూపాల్లో చాందిని దువ్వూరి చేస్తున్న సేవలు.. సమాజంలోని అట్టడుగు వర్గాలను అభ్యున్నతి దిశగా నడిపిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఈ నేపథ్యంలో ఉమెన్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ గా బరిలో నిలిచిన చాందిని దువ్వూరిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవడం మన కర్తవ్యం. మరీ ముఖ్యంగా మహిళలకు బాధ్యత కూడా. నరేన్ కొడాలి నాయకత్వంలో ఉన్న చాందిని దువ్వూరితోపాటు వీరి బృందాన్ని గెలిపించాల్సిన అవసరం ఎతైనా ఉంది.
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః
యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రఫలాః క్రియాః
ఎక్కడెక్కడ మహిళలు గౌరవింపబడతారో.. పూజింపబడతారో.. అక్కడ దేవతలు నివాసముంటారు. మహళలు గౌరవింపబడని చోట ఎటువంటి శుభాలు కలగవు అని రుషి వాక్కు. మన పెద్దలు మహిళకు గౌరవాన్ని ఇవ్వడంతోపాటు పెద్ద పీట కూడా వేశారు. ఈ స్ఫూర్తిని నరనరాన నింపుకొన్న చాందిని దువ్వూరి.. మహిళలకు సమాజంలో సరైన గౌరవం, స్వేచ్ఛ, సమానత్వం, రక్షణ కల్పించేలా మార్పులు తీసుకువచ్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు.
చాందిని సేవలు చిరస్మరణీయం!
తానాకు చాందిని దువ్వూరి అందిస్తున్న సేవలు చిరస్మరణీయం అనడంలో ఎలాంటి అతిశయోక్తీలేదు. 16 సంవత్సరాలకుపైగా కమ్యూనిటీ సేవలో కొనసాగుతున్నారు. అదేసమయంలో 12 సంవత్సరాలకుపైగా మహిళల అభ్యున్నతిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పాఠశాలల అభివృద్ధి, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు. మరీ ముఖ్యంగా కరోనా సమయంలో తెలుగు రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించారు.
పేదలకు, కరోనా బాధితులకు వైద్యసేవలు అందించేలా కృషి చేశారు. అదేసమయంలో నిరుపేదలకు నిత్యావసర సరకుల పంపిణీ చేపట్టారు. పనులు లేక, ఆకలితో అలమటిస్తున్న వారికి అన్నదానం చేశారు. అదేసమయంలో సీనియర్ సిటిజెన్స్ హోమ్స్, పునరావాస కేంద్రాలు, బాలికలను దత్తత తీసుకుని వారిని చదివించడం, వారికి కావాల్సిన సౌకర్యాలను సమకూర్చడం ఇలా.. అనేక రూపాల్లో చాందిని దువ్వూరి.. తన సేవలను విస్తృతం చేశారు.
కోవిడ్ సమయంలో వైద్యసేవలకోసం ప్రకాశం జిల్లాలో ఆసుపత్రిని దత్తత తీసుకుని వైద్యసేవలను మెరుగుపరిచారు. లాక్డౌన్ సమయంలో దాదాపు 4,000 మందికిపైగా వలస కూలీలకు ప్రతిరోజూ ఆహారం అందించారు. దాదాపు 3,500కు పైగా నిత్యావసర సరుకులను నిరుపేదలకు, సేవా సంస్థలకు పంపిణీ చేశారు. 1200మందికిపైగా నేత కార్మికులకు ఆసరా కల్పించారు.
తానా ద్వారా మహిళా కార్యక్రమాలను అన్నీచోట్లా నిర్వహించారు.. యువతను, మహిళలను చైతన్యపరచడం ద్వారా.. సమాజంలో వారి పాత్రను ఇనుమడింపజేశారు.. అనేక కార్యక్రమాల్లో యువతను, మహిళలను భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. మహిళా సాధికారతకు విద్య ప్రధాన ఆయుధమని విశ్వసించిన చాందిని దువ్వూరి.. ఆదిశగా మహిళా విద్యకు పెద్దపీట వేశారు. ఇక, సమాజంలో ప్రధాన సమస్యగా ఉన్న గృహ హింస, పురుషాధిత్యత, మహిళలపై దౌర్జన్యాలు వంటివాటిని అరికట్టేందుకు తనవంతు కృషి చేస్తున్నారు.. అత్యాచారాలకు గురైన ఆడపిల్లలను ఆదుకోవడంతోపాటు వారి జీవనస్థితిగతులు మెరుగుపడేలా సహాయపడుతున్నారు.. దీనిని మరింత విస్తృతం చేయనున్నారు.. ఈ క్రమంలో `నారీ ఫౌండేషన్` సంస్థను ఏర్పాటు చేసి మహిళలకు సహాయపడుతున్నారు. ఓవైపు ఐటీ కన్సల్టింగ్ కంపెనీ ప్రెసిడెంట్గా ఎంతోమందికి ఉపాధి సౌకర్యాన్ని కల్పించారు చాందిని దువ్వూరి.
మన హైదరాబాద్ ఆడపడుచు!
హైదరాబాద్లో పుట్టి పెరిగి అమెరికాకు ఉపాధి నిమిత్తం వెళ్లారు చాందిని దువ్వూరి. అమెరికాలో ఐటీ కన్సల్టింగ్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఇన్నోవేటివ్ ఐటీ కన్సల్టింగ్ కంపెనీకి ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. యునైటెడ్ నేషన్స్ మహిళలపై ఏర్పాటు చేసిన కమిటీలో మెంబర్గా, యంగ్ ఎంట్రప్రెన్యూర్స్ అకాడమీలో ప్రోగ్రామ్ మేనెజర్గా ఉంటూ టీచింగ్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ వ్యాల్యూస్ (ఐఎహెచ్వి)కు ఫ్యాకల్టీగా ఉన్నారు. బ్యాక్ టు ది రూట్స్ ప్రాజెక్ట్ కు కో ఆర్డినేటర్ గా, ఓవర్సీస్ వలంటీర్ ఫర్ బెటర్ ఇండియా ఉమెన్ వింగ్ కు బోర్డ్ డైరెక్టర్ గా, తానాలో ఉమెన్ ఎంపవర్మెంట్ కో ఆర్డినేటర్ గా పనిచేస్తున్నారు..
ప్రముఖుల కార్యక్రమాల్లో..
అమెరికాకు వచ్చిన ప్రముఖుల పర్యటనల్లో చాందిని దువ్వూరి కీలకపాత్ర పోషించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ న్యూజెర్సి, కాలిఫోర్నియా పర్యటనల సమయంలో వారి పర్యటన ఏర్పాట్లను చూసే కమిటీలో, అలాగే చికాగోలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన కమిటీలో, డల్లాస్, చికాగోలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్ల కమిటీలో చాందిని దువ్వూరి కీలకపాత్ర పోషించారు. అదేవిధంగా భారతీయ సంగీతంపై ఉన్న ఆసక్తితో పలు సంగీత కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకులతో అమెరికాలో కచేరీలు ఏర్పాటు చేయించారు. దేవిశ్రీ ప్రసాద్, ఎస్ఎస్. థమన్, ఎ.ఆర్. రెహ్మాన్, మణిశర్మ, ఆర్.పి. పట్నాయక్లాంటి దిగ్గజ సంగీత దర్శకులతో కచేరీలు ఏర్పాటు చేయించారు.
లక్ష్యం.. ఇదే!
చాందిని దువ్వూరి నేటి తరాన్ని.. మరీ ముఖ్యంగా మహిళలను అభ్యున్నతి బాటవైపు నడిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మహిళలకు ఎల్లవేళలా అండగా ఉండటం, వారి చదువుకు సహాయపడటం, గృహ హింస, ఇతర దౌర్జన్యాలకు బలైన మహిళలను, ఆడపిల్లలను ఆదుకోవడంతోపాటు వారి జీవనస్థితిగతులు మెరుగుపడేలా కృషి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో చాందిని దువ్వూరి వంటి దూరదృష్టి, నిశిత పరిజ్ఞానం, సమాజంపై అవగాహన, మహిళలను అభ్యున్నతి పథంలో నడిపించాలనే తపన ఉన్న వారికి అవకాశం ఇవ్వడం. గెలిపించుకోవడం మన బాధ్యత. కాబట్టి.. ఆమెనే గెలిపించుకుందాం.. మన కుటుంబాలను అభ్యున్నతి దిశగా నడిపించుకుందాం.