జడ్జిలను తిట్టిన కేసు సీబీఐకి వెళ్లింది… ఇంకా నో రిజల్ట్
దళిత డాక్టర్ సుధాకర్ కేసు సీబీఐకి వెళ్లింది… ఇంకా నో రిజల్ట్
మాజీ సీఎం తమ్ముడు వివేకానంద మర్డర్ కేసు సీబీఐకి వెళ్లింది… ఇంకా నో రిజల్ట్…
ఈ నేపథ్యంలో అసలు సీబీఐలో ఏం జరుగుతోంది అని తెలుగుదేశం నేత, మాజీ పోలీసు అధికారి వర్ల రామయ్య ప్రశ్నించారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ విషయంలో సీబీఐ వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోంది వర్ల రామయ్య అసహనం వ్యక్తం చేశారు.
చట్టం ఎవరికీ చుట్టం కాదని అందరూ నమ్ముతారు… పేదవారికి, ధనవంతులకు, అధికారంలో ఉన్నవారికి, లేనివారికీ, అందరికీ చట్టం సమానమే అని చట్టం చెబుతోంది.
కానీ జగన్ విషయంలో మాత్రం సీబీఐ సమ దృష్టితో వ్యవహరించడం లేదు. జగన్ కోర్టు వాయిదాలకు రాకపోయినా సీబీఐ నోరు విప్పదని ఆయన ఆరోపించారు.
కోర్టులో జగన్ కేసుల విచారణ సరిగా జరక్కపోయినా పట్టించుకోదని రామయ్య ఆరోపించారు. జగన్ విషయంలో ఎందుకు సీబీఐ సైలెంటుగా ఉంది అని రామయ్య నిలదీశారు.