మరో వివాదంలో జగన్ విధేయుడు ఇరుక్కున్నాడని టీడీపీ లీడర్ నారా లోకేశ్ ఆధారాలతో సహా మాట్లాడుతున్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్టు ఉంచారు. గుంటూరు జెడ్పీ చైర్ పర్సన్ క్రిస్టినా భర్త కత్తెర సురేశ్ పేరిట నమోదయిన పలు అభియోగాలను కేంద్ర దర్యాప్తు బృందం పరిశీలిస్తోంది. విదేశాల నుంచి అక్రమదారుల్లో స్వచ్ఛంద సంస్థల పేరిట నిధులు సేకరించారని, ఇది చట్ట విరుద్ధం అని తేల్చింది కేంద్రం.
ఈ చర్య కారణంగా ఆయన్ను అరెస్టు చేయడమే కాకుండా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనుంది కేంద్రం. ఈ మేరకు సీబీఐ ఇప్పటికే రంగంలో దిగి సంబంధిత న్యాయపరమైన, శాఖా పరమైన చర్యలన్నింటినీ షురూ చేసింది. దీంతో ఈ విషయం సంచలనాత్మకంగా మారింది.
వాస్తవానికి కరోనా సమయంలో కూడా కేంద్రం కఠినంగా ఉంటూ, విదేశీ సంస్థలు మనకు సాయం చేస్తామన్నా వద్దనే చెప్పింది.హవాలా దారుల్లో వచ్చే డబ్బుపై కూడా ఎప్పటి నుంచో నిఘా పెంచింది. తాజా చర్యతో టీడీపీ వర్గాలు వైసీపీ ని టార్గెట్ చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నాయి. గతంలోనూ విదేశాల నుంచి డబ్బులు తీసుకోవడం, మనీ ల్యాండరింగ్ కు పాల్పడడం వంటి వైసీపీ ఖాతాలో ఉన్న నేరాలే అని, వాటికి కొనసాగింపుగానే సురేశ్ చేష్టలు కానీ నిబంధనలకు నీళ్లొదిలి చేసిన తప్పులు ఉన్నాయని టీడీపీ అంటోంది.
విజయవాడలో సురేశ్ నడుపుతున్న క్రైస్తవ మిషనరీతో పాటు హార్వెస్ట్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థకు ఉన్న అనుమతులు కూడా కేంద్రం రద్దు చేసి, అతను నిబంధనలకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రతి చర్యపైనా కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతోంది.