• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆ ముగ్గురూ బీజేపీ నీడ‌లోనేనా ? తీన్మార్ తెలంగాణ

admin by admin
May 13, 2022
in Politics, Telangana, Top Stories
0
0
SHARES
334
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓ మూడు పార్టీలు తెలంగాణ వాకిట అత్యంత కీలకం కానున్నాయి. ఆ మూడు పార్టీలు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాయి. అయితే వాటిని న‌డిపిస్తున్న జాతీయ శ‌క్తి మాత్రం బీజేపీనే అన్న అనుమానాలు అధికార ప‌క్షం అయిన తెలంగాణ రాష్ట్ర స‌మితి నుంచే వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఎవ‌రేంటో..? ఎవ‌రెటో చూద్దాం..  ముందుగా ఆ మూడు పార్టీలు ఏవంటే.. ఒకటి వైఎస్సార్టీపీ (అధినేత్రి, ష‌ర్మిల‌), రెండు ప్ర‌జా శాంతి పార్టీ (అధినేత‌, కేఏ పాల్ ), మూడు బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ (బీఎస్పీ) (ప్ర‌స్తుత తెలంగాణ వ్య‌వహారాల ఇంఛార్జ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్) .

ముఖ్యంగా ఇప్పుడు పాద‌యాత్ర చేస్తున్న ష‌ర్మిల గురించే చెప్పుకోవాలి. ఆమె విప‌రీతంగా పాల‌క‌ప‌క్షంపై ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం తేవాల‌న్న ల‌క్ష్యంతో ఉన్నారు. పైకి ఈ మాటలు చెప్పినా కూడా ఆమె పార్టీ నాయ‌కులు లోపాయ‌కారీగా బీజేపీతో  స‌త్సంబంధాలు నెర‌పుతున్నార‌ని కొన్ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. కేసీఆర్ ను వ్య‌తిరేకించిన‌ప్ప‌టికీ ఇదంతా బీజేపీకి సాయం చేసేందుకే అన్న వాద‌న ఒక‌టి బ‌లీయంగా వినిపిస్తోంది తెలంగాణ రాష్ట్ర స‌మితి నుంచి! అందుకే ఆమె పాద‌యాత్ర చేసినా లేదా వ్యాఖ్య‌లు చేసినా అవ‌న్నీ విప‌క్ష పార్టీ (బీజేపీ)  మేలు కోరి చేస్తున్న‌వే అన్న అభిప్రాయం ఒక‌టి వ‌స్తోంది.

ఇదే స‌మ‌యంలో బండి సంజయ్ క‌న్నా బాగా ప్ర‌భావితం చేసే లీడ‌ర్ ష‌ర్మిల మాత్ర‌మేన‌ని అంటున్నారు కొంద‌రు. ఆ విధంగా బీజేపీకి ఆమె పైకి క‌నిపించ‌ని విధంగా సాయం చేస్తూనే ఆ పార్టీకి స్టార్ క్యాంపైన‌ర్ గా ఉన్నార‌న్న వాద‌న ఒక‌టి సోష‌ల్ మీడియా టాక్స్ లో విపరీతంగా వినిపిస్తోంది. ఇక మ‌రో అధినేత కేఏ పాల్ కూడా కేసీఆర్ ను వ్య‌తిరేకించి బీజేపీకి సాయం చేస్తున్నారా అన్న అనుమానాలు బ‌ల‌ప‌డేందుకు నిన్న‌టి వేళ అమిత్ షా తో ఆయ‌న భేటీ కావ‌డ‌మే నిద‌ర్శ‌న‌మ‌ని కేసీఆర్ శ్రేణులు అంటున్నాయి. సంబంధిత విజువ‌ల్స్-ను వైర‌ల్ చేస్తున్నాయి సోష‌ల్ మీడియాలో !
ఆఖ‌రుగా బీఎస్పీ వ్య‌వహారాల‌ను తెలంగాణ వాకిట చ‌క్క‌దిద్దుతున్న విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ కూడా బీజేపీకి అనుగుణంగానే సాయం చేసి, వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్ ను ఓడించాల‌న్న వ్యూహంతో ఉన్నార‌న్న‌ది గులాబీ దండు సోష‌ల్ మీడియాలో చేస్తున్న ప్ర‌చారం. ఇందులో వాస్తవాలు ఎలా ఉన్నా వీరంద‌రినీ జ‌యించి త‌మ అధినేత మ‌రోసారి తిరుగులేని మెజార్టీతో అధికారం కైవ‌సం చేసుకోవ‌డం ఖాయం అన్న‌ది తెలంగాణ రాష్ట్ర స‌మితికి చెందిన కీల‌క నేత‌ల అభిప్రాయం.
Tags: 2023 elections in telanganabjp becoming strongpolitical gameTelangana politicsTRS govt
Previous Post

శ్రీలంకలో ప్రజల విజయం

Next Post

టీడీపీ స్పీక్స్ : కేంద్రం బోనులో జ‌గ‌న్ విధేయుడు? ఓవ‌ర్ టు గుంటూరు

Related Posts

Andhra

`గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!

June 22, 2025
Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Movies

నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!

June 22, 2025
Andhra

మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి

June 21, 2025
Andhra

మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌

June 21, 2025
Andhra

యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు

June 21, 2025
Load More
Next Post

టీడీపీ స్పీక్స్ : కేంద్రం బోనులో జ‌గ‌న్ విధేయుడు? ఓవ‌ర్ టు గుంటూరు

Please login to join discussion

Latest News

  • `గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!
  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
  • `యోగాంధ్ర`పై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు.. బాబు స్ట్రాంగ్ కౌంట‌ర్‌..!
  • చంద్ర‌బాబా మ‌జాకా.. ప‌ట్టుబ‌ట్టారు.. రికార్డు కొట్టారు..!
  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra