సాధారణంగా రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలలో లోపాలను ఎత్తి చూపడం, సహేతుమకమైన విమర్శలు చేసి ప్రభుత్వాన్ని అప్రమత్తం, కరోనా విపత్తుపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేయడం ప్రధాన ప్రతిపక్ష బాధ్యత. అందులోనూ, ఏపీ సీఎంగా జగన్ వంటి అనుభవంలేని నేత ఉన్నపుడు టీడీపీ వంటి అనుభవం ఉన్న ప్రధాన ప్రతిపక్షానికి ఆ బాధ్యత మరింత ఎక్కువ.
ఇప్పటికే జగన్ కరోనాపై చేతులెత్తేశారని సొంతపార్టీ ఎంపీలే విమర్శిస్తున్న తరుణంలో టీడీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు కరోనాపై తగు సూచనలు చేశారని నీతి ఆయోగ్ కూడా కితాబిచ్చింది. ఈ క్రమంలోనే కర్నూలు నుంచి పలు ప్రాంతాలకు ఎన్440కె వేరియంట్ కరోనా వైరస్ వ్యాప్తి జరిగే అవకాశముందని చంద్రబాబు ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు.
అయితే, అసలు ఆ వేరియంట్ లేదని మంత్రి పేర్ని నాని బుకాయించారు. అంతేకాదు, ప్రజలను అప్రమత్తం చేసిన పాపానికి చంద్రబాబుపైనే కేసు బనాయించారు. ఈ క్రమంలో చంద్రబాబుపై కేసు పెట్టడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కరోనా నియంత్రణలో జగన్ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు మండిపడ్డారు.
ఎన్440కె వైరస్‌పై మీడియాలో వచ్చిన కథనాలను చంద్రబాబు ప్రస్తావించి ప్రజలను అప్రమత్తం చేశారని, అందుకే ఆయనపై తప్పుడు కేసులు పెట్టడం దుర్మార్గమని అన్నారు. చంద్రబాబుపై కేసు నమోదు కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని గుర్తు చేశారు. కరోనాపై సాధారణ పౌరులు కూడా తమ గళాన్ని స్వేచ్ఛగా వినిపించొచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని కళా వెంకట్రావు గుర్తు చేశారు.
కర్నూలులో ఎన్ 440కె రకం వైరస్‌తో మృతి చెందిన వ్యక్తి ఫొటోతో సహా మీడియాలో కథనాలు వచ్చాయని, ప్రమాద తీవ్రతపై సీసీఎంబీ కూడా తన నివేదికల్లో హెచ్చరించిందని అన్నారు. మరి వారిపై కేసులు పెడతారా? అని ప్రశ్నించారు.