ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చాలా పరిణతితో వ్యవహరిస్తుంటారని అంతా అనుకుంటుంటారు. చట్టాలను అతిక్రమించకుండా..నియమ నిబంధనలు పాటిస్తూ..సామాన్య ప్రజలకు రోల్ మోడల్ గా సీఎం ఉంటారు అని భావిస్తుంటారు. అయితే, ఏపీకి నెవర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ సీఎం తానే అని ఫీలయ్యే జగన్ మాత్రం ప్రజలకు బ్యాడ్ ఎగ్జాంపుల్స్ సెట్ చేస్తున్నారు. ఈసీ, పోలీసులు వద్దంటున్నా వినకుండా నిబంధనలను తుంగలో తొక్కి మరీ గుంటూరు మిర్చియార్డులో పర్యటించారు జగన్. ఈ క్రమంలోనే జగన్ తో పాటు 8 మంది వైసీపీ నేతలపై గుంటూరు జిల్లాలోని నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉందని, గుంటూరు మిర్చి యార్డు టూర్ వద్దని జగన్ కు ఈసీ, ఎమ్మెల్సీ ఎన్నికల అధికారి (గుంటూరు జిల్లా కలెక్టర్), పోలీసులు చిలక్కు చెప్పినట్లు చెప్పారు. కానీ, పుష్ప-2 సినిమాలో పుష్పగాడి మాదిరి నీయవ్వ అస్సలు తగ్గేదేలే అంటూ జగన్ మిర్చి యార్డులో పర్యటించారు. ‘గుంటూరు కారం’ ఘాటు దెబ్బకు వచ్చిన తుమ్ములను తట్టుకోలేని జగన్..మీడియా ముందు ఎక్కువ సేపు మాట్లాడలేక తుర్రుమన్నారు. ఆ తర్వాత తాపీగా ఎక్స్ లో తాను మీడియా ముందు చెప్పకుండా వదిలేసిన స్క్రిప్ట్ లో మిగిలిన పాయింట్లు కాపీ పేస్ట్ చేశారు.
ఇక, తనకు పోలీసులు భద్రత కల్పించలేదంటూ జగన్ చెప్పడం కొసమెరుపు. ఈ క్రమంలోనే జగన్ ను గుంటూరు కారం ఘాటు వెంటాడింది. అనుమతి లేకుండా పర్యటించారంటూ జగన్ తో పాటు అంబటి రాంబాబు, కొడాలి నాని, లేళ్ల అప్పిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నందిగం సురేశ్ తదితరులపై ఈసీ ఆదేశాల ప్రకారం నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వైసీపీ నేతలు తమ వాహనాలను రోడ్డు పక్కనే నిలపడం, ఆ పర్యటన వల్ల మిర్చియార్డు మెయిన్ రోడ్డు మీద వందలాది వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులతోపాటు యార్డులో మిర్చి నిల్వ చేసేందుకు వచ్చిన రైతులు ఇబ్బంది పడ్డారు.