2019 నుంచి ఏపీలో హిందు ఆలయాలలో అరాచకాలు జరుగుతున్నాయి.
దీని వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలిసిందే. ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలు గాయపరిచే చర్యలు తరచుగా జరుగుతున్నాయి.
ఆ శ్రీరాముడి విగ్రహ మూర్తిని గుడిలో తొలగించి ధ్వంసం చేసిన వాడికి ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి శిక్ష వేయలేదు అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది.
తాజాగా గుంటూరు జిల్లాలోని పెదకాకాని మల్లేశ్వరస్వామి శివాలయం లో ఘోరం జరిగింది.
ఆలయ క్యాంటీన్ వద్ద మాంసం వండారని వార్తలు వచ్చాయి. అక్కడ మాంసాహారం వండినట్లు ఆధారాలు దొరికాయి. దీంతో తెలుగుదేశం నేతలు ఈ విషయం తెలుసుకుని ఆందోళనకు దిగారు. ప్రజలు ఆలయంలో మాంసాహారం వండటంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. వారు కూడా ధర్నాలు పాల్గొన్నారు.
ప్రజలతో పాటు ధర్నాకు నాయకత్వం వహించిన తెలుగుదేశం నేత ధూళిపాళ నరేంద్రపై కూడా పోలీసులు కేసులు పెట్టారు. మొత్తం 93 మందిపై కేసులు పెట్టారు.
గొడవ పెద్దది కావడంతో ప్రభుత్వం పరువు ఓట్లు కాపాడుకోవడం కోసం క్యాంటీన్‌ను సీజ్ చేసి, నిర్వాహకుల లైసెన్స్ రద్దు చేసింది.
మాంసం వండితే పట్టించుకోని ఆలయ సిబ్బంది… ధర్నా చేసిన తెలుగుదేశం నేతలపై, ప్రజలపై కేసులు పెట్టడంపై ప్రజలు విస్మయం వ్యక్తంచేశారు.