ఈరోజు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఢిల్లీకెళ్లి ఆర్థిక మంత్రి నిర్మలను కలిశారు. అప్పులు కావాలి, ఆర్థిక సాయం కావాలి అని విజ్జప్తి చేశారు. యథావిధిగా కేంద్రం చేస్తాం, చూస్తాం అని చెప్పి పంపేసింది.
అనంతరం బయటకు వచ్చిన బుగ్గన రెడ్డి ప్రపంచం విస్తుపోయే అబద్ధాన్ని చెప్పారు. గత ఎన్నికల ముందు వరకు చంద్రబాబు పోలవరం అంచనాలు పెంచారు అంటూ టీవీల్లో, సోషల్ మీడియాల్లో సాక్షిపేపర్లో గగ్గోలు పెట్టారు. తీరా ఇపుడు బుగ్గన రెడ్డి మాట్లాడుతూ పోలవరం ఖర్చు పరిమితం చేయమని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు.
ఎక్కువ అంచనాలు పెంచారు అని చెప్పిన నోటితోనే చంద్రబాబు పోలవరం ఖర్చును పరిమితం చేయమని లేఖ రాశారని అబద్ధం చెప్పారంటే… వారు ఎంత తెగించారో అర్థమవుతుంది.
వాస్తవానికి చంద్రబాబు 54 వేలకు ప్రాజెక్టు ఖర్చును పెంచారు. దానిని కేంద్రం ఆమోదించినట్లు స్వయంగా పార్లమెంటులో ప్రకటించి వైసీపీ గాలితీసింది. అయితే, వైసీపీకి బీజేపీ పట్ల ఉన్న భయాన్ని చూసి పోలవరం ప్రాజెక్టు ఖర్చులో కేంద్రం కోత పెట్టింది. దీంతో ఇపుడు చంద్రబాబును బూచిగా చూపడానికి వైసీపీ ప్రయత్నం చేస్తోంది.