కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు ప్రవేశ పెట్టిన 2023-24వార్షిక బడ్జెట్లో వృద్ధి రేటు ఆకాశానికి అంటేలా నిర్ణయించడం గమనార్హం. వృద్ధి రేటు 7% గా అంచనా వేస్తున్నామని మంత్రి నిర్మలా సీతారామన్ ప్రక టించారు. దీనిని బట్టి ఇంత వృద్ధిరేటు ఉన్న ఆర్థిక వ్యవస్థ మనదేకావడం గమనార్హం. ఇక, తొమ్మిదేళ్లలో తలసరి ఆదాయం రెట్టింపైందని నిర్మలమ్మ చెప్పారు.
ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించామని, కోవిడ్-19 సమయంలో ఎవరూ ఆకలితో బాధపడకుండా చూశామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ ఇంకా కొనసాగుతోంద న్నారు. 100 కోట్ల మందికి 220 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులు అందించామన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ సరైన దారిలో పయనిస్తోందన్నారు. గ్రీన్ డెవలప్మెంట్ దిశగా అనేక విధానాలు రూపొందిస్తున్నామని చెప్పారు.
సామాన్యుల సాధికారితకు ఈ బడ్జెట్ తోడ్పడుతుందని నిర్మల చెప్పారు. సామాజిక భద్రత, డిజిటల్ పేమెంట్లలో చక్కటి వృద్ధి సాధించామన్నారు. 2047నాటికి మన దేశానికి స్వాతంత్య్రం లభించి వందేళ్లు పూర్తవుతుంది. ఆ విజన్ లక్ష్యంగా పథకాలు రూపొందిస్తున్నామన్నారు. కోటి మంది రైతులను ప్రకృతి సాగు దిశగా ప్రోత్సహించడం. గోబర్‌ధాన్ స్కీమ్ కింద 500 నూతన వ్యర్థాల నుంచి వెల్త్ ప్లాంట్స్ ఏర్పాటు. రూ.19,700 కోట్లతో నేషనల్ హైడ్రోజన్ మిషన్ ఏర్పాటు. బడ్జెట్లో హరిత వృద్ధిపై దృష్టి.
5జీ వినియోగానికి అవసరమైన యాప్స్ రూపొందించేందుకు 100 ల్యాబ్స్ ఏర్పాటు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఫార్మా రంగ అభివృద్ధికి ప్రత్యేక పథకం. నేషనల్ హైడ్రోజన్ గ్రీన్ మిషన్‌కు రూ.19,700 కోట్లు కేటాయింపు. విద్యుత్ రంగానికి రూ.35వేల కోట్లు కేటాయింపు. దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్‌పోర్టులు, హెలిప్యాడ్ల నిర్మాణం. కొవిడ్ సమయంలో నష్టపోయిన MSMEలకు రిఫండ్ పథకం. నేషనల్ డేటా గవర్నెన్స్ ద్వారా సులభతర కేవైసీ.