టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ లపై మంత్రి కొడాలి నాని గతంలో పలుమార్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అసబ్య పదజాలంతో, వ్యక్తిగత దూషణలకు నాని దిగడం…వాటిని టీడీపీ నేతలు ఖండించడం మామూలే. కానీ, ఈ సారి చంద్రబాబును విమర్శించిన నానిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. టీడీపీ 40 వసంతాల సంబరం సందర్భంగా కొడాలి నానిపై వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొడాలి నాని లాంటి విశ్వాసం లేని కుక్కలను చంద్రబాబు పెంచి పోషించారని బుద్ధా వెంకన్న షాకింగ్ కామెంట్లు చేశారు. నాని వంటి నీచులను తరిమికొట్టాలని టీడీపీ శ్రేణులకు, నేతలకు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే కొడాలి నాని…వారి కుటుంబసభ్యులను సిగ్గులేకుండా తిడతారని పైర్ అయ్యారు. వీరులు పుట్టినగడ్డలో కొడాలి నాని లాంటి సన్నాసులు ఎలా పుట్టారని వెంకన్న ప్రశ్నించారు.
ఏనుగులు పోతుంటే కుక్కలు మొరుగుతాయని, కొడాలి నాని వంటివాళ్లు కుక్కల కంటే హీనమని ఏకిపారేశారు. జగన్ దగ్గర మార్కులు పడతాయని చంద్రబాబును నాని తిడుతున్నాడని, ఆయన మాట్లాడే ప్రతి మాట ఆయన నాశనానికే దారి తీస్తుందని వార్నింగ్ ఇచ్చారు. పప్పు అంటూ కారుకూతలు కూసే కొడాలి నానీ… వారి నాయకుడు గన్నేరుపప్పు అనే విషయం తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు.
ఆనాడు చంద్రబాబు నిర్ణయానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా మద్దతునిచ్చారని, వెన్నుపోటంటే ఏమిటో జగన్ కు బాగా తెలుసని ఎద్దేవా చేశారు. వైయస్ ను బెదిరించి బాబాయ్ వివేకాకు వెన్నుపోటు పొడిచిన ఘనత జగన్ దని, ఆనాడు కుటుంబసభ్యులు కూడా జగన్ కు మద్దతివ్వలేదని గుర్తు చేశారు. టీడీపీని కాపాడి అధికారంలోకి తెచ్చిన ఘనత చంద్రబాబుదని… బాబాయిని చంపిన వారిని కాపాడుతున్న వ్యక్తి జగన్ అని… ఇద్దరిలో వెన్నుపోటుదారుడు ఎవరని ప్రశ్నించారు. సొంత చెల్లెలికి, బాబాయి కూతురుకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్ దని దుయ్యబట్టారు..హత్యా రాజకీయాల చరిత్ర జగన్ దని, చంద్రబాబే రౌడీయిజం చేసేవారైతే నాని లాంటి వారి నోళ్లు లేసేవా? అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే బుద్ధా వెంకన్న కామెంట్లు వింటే కొడాలి నాని చెవుల్లో రక్తమే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.