తుంగభద్ర పుష్కరాల్లో భక్తులకు సరైన వసతులు కల్పించడంలో జగన్ రెడ్డి విఫలమయ్యారు. పుష్కరాలు జరుగుతున్నా.. ఇంకా పనులు కొనసాగుతుండటం జగన్ విధానాలకు నిదర్శనం. హిందూ సంప్రదాయల పట్ల జగన్ రెడ్డి మొదటి నుంచీ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ సంప్రదాయాలపై దాడులు పెరిగాయి. అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి రథం దగ్ధమైనా, విజయవాడ దుర్గగుడి వెండిరథం సింహాలు మాయమైనా చర్యలు లేవు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వరుస సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు పుష్కరాల్లో భక్తుల సహనాన్ని పరీక్షిస్తున్నారు.
పిండప్రదానాల నిర్వహణ కోసం విజయనగరం, గుంటూరు, విజయవాడ నుంచి తుంగభద్ర పుష్కరాలకు వందలాది మంది పురోహితులు కర్నూలుకు వస్తే.. గుర్తింపుకార్డులు ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నారు. మరోవైపు పిండప్రదానాలు చేసే పండితులు లేక భక్తులు అవస్థలు పడుతున్నా పట్టించుకునేవారు లేరు. చేసేది లేక కొందరు భక్తులు అరకొర జల్లు స్నానాలనంతరం పితృదేవతలకు మనసులో నమస్కారం చెప్పుకుని వెనుతిరుగుతున్నారు. జల్లు స్నానాలకూ సరైన ఏర్పాట్లు చేయలేదు. పిండ ప్రదానాలు స్నానమాచరించకుండా ఎవరూ చేయరు. ఈ-టికెట్ తీసుకున్నప్పటికీ పిండప్రదానాలు చేసే పండితులు లేరు. ఉన్న పండితులకు గుర్తింపుకార్డులు ఇవ్వకపోవడంతో ఖాళీగా కూర్చొన్నారు.
దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా పలు ఘాట్ల వద్ద పుష్కరాల పనులు కొనసాగుతూనే ఉన్నాయి. జల్లు స్నానాలకూ పలు చోట్ల షవర్ల నిర్మాణాలే పూర్తికాలేదు. కొన్నిచోట్ల షవర్లు పనిచేయక భక్తులు స్నానాలు కూడా చేయకుండానే వెనుదిరిగే పరిస్థితి నెలకొంది. తుంగభద్ర పుష్కరాల పట్ల జగన్ రెడ్డి నిర్లక్ష్యం సరికాదు. తక్షణమే పండితులకు గుర్తింకుకార్డులు మంజూరు చేయాలి. భక్తులకు అన్ని వసతులు కల్పించాలి.