అమెరికాలోని నిరుపేదలకు తానా సహాయం...100,000 డాలర్ల విలువైన ఆహారపదార్ధాల పంపిణీ...

NRI
కోవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా కబళించిందో, ఎంతమందిని రోడ్డునపాలు చేసిందో అందరికీ తెలిసిందే. అమెరికాలో ఈ కోవిడ్‌ వల్ల ఎంతోమంది నిరుపేదలు ఇబ్బందులపాలయ్యారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని కమ్యూనిటీకి తనవంతుగా ఏదైనా సాయం చేయాలన్న ఉద్దేశ్యంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ముందుకు వచ్చింది. తానా కమ్యూనిటీ సర్వీస్‌ కో ఆర్డినేటర్‌ మల్లివేమన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని 150 ప్రాంతాల్లో నిర్వహించనున్నారు.
అన్నీ దానాలలో అన్నదానం గొప్పదని మన పెద్దలు చెబుతుంటారు. ఎంతోమంది నిరుపేదలు తిండికోసం కష్టాలు పడుతున్నారని, అటువంటి వారిని ఆదుకోవడానికే తానా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని మల్లి వేమన చెప్పారు. ఈ సందర్భంగా 100,000 డాలర్ల విలువైన ఆహారపదార్ధాలను పంపిణీ చేయనున్నామని, 150 ప్రాంతాల్లో ఈ సహాయం చేయనున్నట్లు  చెప్పారు. తానా తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్‌ సహాయ కార్యక్రమాలను చేసిందని, ఎంతోమందికి అన్నదానం చేసిందని, అమెరికాలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన తానా పెద్దలకు, ప్రెసిడెంట్‌ జయ్‌ తాళ్ళూరి, మాజీ అధ్యక్షులు సతీష్‌ వేమన, కార్యదర్శి రవి పొట్లూరి, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ అంజయ్య చౌదరి లావు, తానా నేషనల్‌ కేర్స్‌ చైర్‌ జోగేశ్వరరావు పెద్దిబోయినకు మల్లివేమన ధన్యవాదాలు చెప్పారు

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.