ఆకలి రుచెరగదు.. నిద్ర సుఖమెరుగదు.. అని ఒకసామెత. మరి సెక్స్ విషయానికి వస్తే.. స్థాయిని బట్టి కదా.. వ్యక్తుల మధ్య సంబంధాలు పెరిగి.. సెక్స్‌కు దారితీసేది. కానీ, ఇప్పుడు ఇది కూడా ఆకలి.. నిద్ర.. మాదిరిగానే ఎలాంటి స్థాయిలు లేకుండానే సంబంధాలు పెట్టుకున్న తీరు.. ఒక కుటుంబాన్ని నిలువునా ముంచేసింది. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఎంతో కష్టపడి భర్త ఏర్పాటు చేసిన హోటల్లో సప్లయర్‌గా పనిచేసే ఓ యువకుడితో సదరు హోటల్ యజమాని భార్య సెక్స్ సంబంధం పెట్టుకుంది. ఇక్కడ ఆమె ఎలాంటి స్థాయినీ చూసుకోలేదు. కేవలం సెక్స్ సుఖాన్నే చూసుకుంది(ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పింది). అంతే.. తమకు.. అడ్డుగా ఉన్నాడని భర్తను కూడా చంపించేసింది. ఇదీ.. కథ.. అనేక మలుపులు తిరిగిన తర్వాత.. ఎట్టకేలకు ప్రియుడు, ప్రియురాలు.. పోలీసులకు చిక్కారు. సో.. సెక్స్‌లో ఇప్పుడు స్థాయిలతోనూ పనిలేకుండా పోయిందన్నమాట.
ఏం జరిగింది?
కర్నాటకలోని రామనగర జిల్లా చన్నపట్టణ తాలూకా నణ్ణూరుకు చెందిన 34 ఏళ్ల అరుణ్‌కుమార్
ఆర్‌ఆర్‌నగర ఉత్తరహళ్లి రోడ్డులో ఓ హోటల్ పెట్టుకుని జీవితాన్ని సాగిస్తున్నారు. ఆ హోటల్‌కు గణేశ్ అనే వ్యక్తి నీటిని సరఫరా చేస్తున్నాడు. ఇతనితో అరుణ్‌కుమార్ భార్య రంజిత వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన అరుణ్ .. భార్యను తీవ్రంగా మందలించాడు. అంతే.. ఇక్కడే అసలు కథ ప్రారంభమైంది. తమ సెక్స్ సుఖానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం వేసింది.
గతనెల 28న పార్టీ చేసుకుందామని చెప్పి అరుణ్‌ను గణేశ్ అతని స్నేహితులు శివానంద, దీపు, శరత్‌లు పిలిపించారు. అరుణ్ రాగానే అతని కళ్లపై కారంపొడి చల్లి మారణాయుధాలతో చంపి హత్య చేశారు. ఇదీ.. సంగతి!!