జాతీయ పార్టీగా తమను తాము ప్రకటించుకున్న అనంతరం జాతీయ కార్యకలాపాలు విస్తరించడానికి కేసీఆర్ భారీగా ఖర్చు పెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీలో ఈరోజు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దేశ రాజధానిలో ప్రారంభించారు.
ప్రత్యేక శుభ ముహుర్తంలో నిర్ణయించుకున్న ముహూర్తానికి (1గం.05ని.) ఆఫీస్ రిబ్బన్‌ను కట్ చేశారు కేసీఆర్. బీఆర్ఎస్ సెంట్రల్ ఆఫీసు ప్రారంభోత్సవానికి బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇందులో మొదటి అంతస్తులో కేసీఆర్ ఆఫీసు ఉంటుంది. ప్రారంభోత్సవం తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలతో మొదటి అంతస్తులోని తన కార్యాలయంలో కేసీఆర్ భేటీ అయ్యారు.
మొత్తం 1,300 గజాల్లో 20 వేల చదరపు అడుగుల నిర్మాణం చేశారు. లోయర్ గ్రౌండ్, గ్రౌండ్ పార్కింగ్ కోసం పెట్టారు. మొదటి, రెండవ, 3వ అంతస్తులతో కలిపి మొత్తం 5 అంతస్తులున్నాయి.
లోయర్ గ్రౌండ్లో పార్కింగ్ తో పాటు ప్రెస్ మీట్ల కోసం ఒక వేదిక తో కూడిన హాల్ నిర్మించారు. దీనికి ప్రత్యేక ఎంట్రన్స్ పెట్టారు. పెద్ద వేడుకలా జరిగిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు పాల్గొన్నారు.
Bharat Rashtra Samithi (BRS) President, CM Sri K Chandrashekhar Rao inaugurated the party’s central office building at Vasant Vihar in New Delhi today. pic.twitter.com/zuBvRXns3s
— BRS Party (@BRSparty) May 4, 2023