ఈ నెల 5న దేశవ్యాప్తంగా దసరా పండుగ జరగనుంది.
సాధారణంగా.. దేశవ్యాప్తంగా ప్రజులు చేసుకునే అతి తక్కువ పండుగల్లో.. ఇది కీలకమైన పండుగ. దీంతో ప్రజలు అట్టహాసంగానే చేసుకుంటారు.
ఇక, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ దసరా మరింత ఉత్సాహంగా చేసుకోనున్నారు. రెండేళ్ల కరోనా తర్వాత.. వచ్చిన పండుగ కావడంతో దీనికి ప్రత్యేకత ఏర్పడింది.
అయితే.. తెలంగాణలో మాత్రం ఈ దసరాకు మరింత ప్రత్యేకత ఉంది.
ఈ దసరా రోజు తెలంగాణ సారథి.. సీఎం కేసీఆర్.. జాతీయ పార్టీని ప్రకటించనున్నారు.
బహుశ తెలుగు నేల నుంచి ఒక ప్రాంతీయ పార్టీ.. అందునా అధికారంలో ఉన్న పార్టీ.. జాతీయ స్థాయిలో్ పార్టీని పెట్టడం.. దేశ చరిత్రలో ఇదే ప్రథమం.
దీంతో ఈ ప్రకటన చేసే రోజును అదిరిపోయేలా నిర్వహించాలని.. సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన `రోజును మించి..` అన్నట్టుగా.. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ధూమ్ ధామ్‌గా కార్యక్రమాలు నిర్వహించాలని పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు.
జాతీయపార్టీ ఏర్పాటుపై ప్రకటన చేసినప్పటి నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు.
తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఫ్లెక్సీలు బాణాసంచా సందడి వంటి కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రచిస్తున్నారు.
ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా పార్టీ నేతలతో కార్యచరణ సిద్ధం చేయనున్నారు.
దసరారోజు వివిధరాష్ట్రాలకు చెందిన రైతు, కార్మిక సంఘాలు, పార్టీల నేతల్ని ప్రగతిభవన్‌లో భోజనానికి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 6 లేదా 7న భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు.
దేశమంతటా తెలంగాణ మోడల్ అనే నినాదం, అజెండాతో తొలి అడుగువేసేందుకు గులాబీదళపతి సిద్ధమవుతున్నారు.
బీజేపీ, కాంగ్రెస్‌కి సమదూరం పాటిస్తూ వివిధ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలకు కేసీఆర్ ప్రణాళికలు చేస్తున్నారు.
పర్యటనల కోసం సొంతంగా విమానం కొనుగోలుకు సిద్ధమవుతు న్న విషయం తెలిసిందే.
పార్టీ ప్రకటన అనంతరం.. కేంద్రంపై ప్రధానంగా దాడిచేస్తూ రైతు, దళిత, కార్మిక,యువత, మహిళల అంశాలపై ఉద్యమానికి శ్రీకారంచుట్టేలా వ్యూహాలు రచించారు.
పలురాష్ట్రాలకు సమన్వయకర్తల్ని నియమించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు, విరాళాల సేకరణ వంటి కార్యక్రమాలను వివిధ దశల్లో చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
మొత్తంగా .. ఈ నెల 5న మాత్రం.. తెలంగాణలో ఒక పెద్ద సంబురమే జరగనుందని టీఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
Read Also