హీరో నాగ చైతన్యతో విడాకుల తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. గో అంటావా మావా…గోవా అంటావా మావా అంటూ వెకేషన్ లు, టూర్ లతో సామ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో దుమారం రేెపుతోంది. మామూలుగానే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సామ్…విడాకుల తర్వాత మరింత యాక్టివ్ అయింది.
తన మనసులోని భావాలను, అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేస్తూ…నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే తాజాగా సమంత చేసిన ఓ పోస్ట్ వైరల్ అయింది. ‘‘నిజాలు అనేది అరుదుగా బయటకు వస్తాయి కానీ ఎప్పుడూ అబద్ధాలే ప్రచారంలో ఉంటాయి.. అంతేకాదు అబద్ధాలనే ఈ సమాజం ఎక్కువగా నమ్ముతుంది’’ అంటూ సమంత చేసిన కోట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
దీంతో, సమంత పోస్ట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఓ హాలీవుడ్ సినిమాకు సంబంధించి సామ్ ఈ పోస్ట్ చేసిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, తన పర్సనల్ లైఫ్ గురించి, నాగ చైతన్యతో విడాకుల సమయంలో అబద్ధాలు ప్రచారం చేసిన వారి గురించి సామ్ ఈ పోస్ట్ పెట్టిందని మరికొందరు అంటున్నారు. విడాకుల ప్రస్తావన తెచ్చిందే సమంత అని, చైతూ ఆమె నిర్ణయాన్ని గౌరవించాడని నాగార్జున చేసిన కామెంట్లకు కౌంటర్ గా సామ్ ఈ పోస్ట్ పెట్టిందని మరొక టాక్.
మరోవైపు, ఈ ఏడాది ఆగస్టులో చైతూ, సామ్ లు ఇద్దరు పోటాపోటీగా ఫైట్ చేసుకోబోతున్నారు. బాక్సాఫీస్ వద్ద జరిగే ఈ పోరులో ఎవరిది పైచేయి అన్నది ఆసక్తికరంగా మారింది. కేవలం ఒక్కరోజు తేడాతో సమంత, నాగచైతన్యలు నటించిన సినిమాలు విడుదల కాబోతుండడంతో ఈ ఇద్దరి అభిమానులు పోటాపోటీగా పోస్టులు పెడుతున్నారు. సమంత ప్రధాన పాత్రను పోషించిన ‘యశోద’ చిత్రం ఆగస్ట్ 12న విడుదల కాబోతుండగా.. నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాల్లో ఏది సక్సెస్ అవుతుందో? ఎవరు విజయాన్ని అందుకుంటారు? చైతూ, సామ్ ల మధ్య బాక్సాఫిస్ వార్ లో…గెలుపెవరిది? అన్నది తేలాల్సి ఉంది.