• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కేసీఆర్ కు తీన్మార్ మల్లన్న బంపర్ ఆఫర్

admin by admin
May 6, 2022
in Politics, Telangana, Top Stories
0
0
SHARES
195
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

జర్నలిస్టు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కు, టీఆర్ ఎస్ ప్రభుత్వానికి మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. వివిధ కేసులలో తీన్మార్ మల్లన్న దాదాపు 74 రోజులపాటు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరైంది. టీఆర్ఎస్ తనను కక్ష సాధింపు ధోరణితో అనేక ఇబ్బందులకు గురి చేసిందని, లేనిపోని కేసులు పెట్టించి జైలుకు పంపిందని మల్లన్న గతంలో ఆరోపించారు.

ఆ తర్వాత కేసీఆర్, కేటీఆర్ లపై విమర్శలు గుప్పించిన తీన్మార్ మల్లన్న బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో చేరిన తర్వాత మల్లన్న దూకుడు పెంచారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవితలను అమరవీరుల స్తూపానికి కట్టేస్తానని షాకింగ్ కామెంట్లు చేశారు. తెలంగాణలో అత్యంత మోసకారి కేసీఆర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై 38 కేసులు పెట్టిన కేసీఆర్ ఏం సాధించారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ సర్కార్ ను కూల్చడమే తన ధ్యేయమని, బీజేపీ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతానని శపథం చేశారు.

ప్రస్తుతం బీజేపీలో ఉన్న మల్లన్న…త్వరలో కొత్త పార్టీ పెడతారన్న టాక్ వస్తోంది. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన చేశారు. ఇకపై కేసీఆర్‌ను తిట్టబోనని ఒట్టేసి చెబుతున్నానని మల్లన్న శపథం చేయడం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. కానీ, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దోపిడీ రాజ్యం పోయే వరకు మాత్రం తన ‘7200 మూవ్‌మెంట్’ ద్వారా పోరాటం కొనసాగిస్తానని తేల్చి చెప్పారు.

ముఖ్యమంత్రి, మంత్రులపై విమర్శలు చేయడం తమ విధానం కాదని, ప్రజా చైతన్యం కోసంమే తమ పోరాటమని మల్లన్న చెప్పారు. విద్యావంతులైన బాల్క సుమన్‌, గ్యాదరి కిషోర్‌లకు విద్యాశాఖను అప్పగిస్తే బాగుంటుందని, పేదోళ్ల, పెద్దోళ్ల బిడ్డలు ఒకే పాఠశాలలో వరుసలో కూర్చొని చదువుకోవాలన్నదే తమ మూవ్‌మెంట్‌ లక్ష్యమని అన్నారు.

అకాల వర్షాలతో రైతులు ఆగమవుతుంటే కేసీఆర్ మాత్రం వ్యవసాయ క్షేత్రం విడిచి బయటకు రావడంలేదని మల్లన్న విమర్శలు గుప్పించారు. యాదాద్రిలో వందల కోట్లు వెచ్చించి చేసిన అభివృద్ధి ఒక్క గాలివానకే తేలిపోయిందని ఎద్దేవా చేశారు. తన ఆస్తులన్నీ ప్రభుత్వానికి రాసిచ్చి జూన్‌ రెండో వారంలో చేపట్టే ప్రజా పాదయాత్రలో పాల్గొంటామని తెలిపారు.

Tags: cm kcrnew party by mallannashocking decisionteenmar mallannawon't scold kcr
Previous Post

ప్రతి పనీ ప్రతిపక్షానిదేనా? మరి నువ్వేం చేస్తున్నావ్ జగన్?

Next Post

చైతూ, సామ్ ల మధ్య వార్…గెలుపెవరిది?

Related Posts

Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Load More
Next Post
Samanta, nagachaitanya

చైతూ, సామ్ ల మధ్య వార్...గెలుపెవరిది?

Please login to join discussion

Latest News

  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra