రైతుల కోసం అమెరికా ఎన్నారైల ప్రత్యేక మద్దతు-'బోండా ఉమ' హాజరు

NRI
ఒక స్వార్థ నిర్ణయంతో ఛిద్రమైన అద్భుతమైన భవిష్యత్తు తిరిగి సాధించడానికి జరుగుతున్న ఉద్యమం అమరావతి పోరాటం. ఏపీ ప్రజలందరి కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులు న్యాయం కోసం పోరాడుతున్నారు. గత 365 రోజుల నుండి నిరంతరాయంగా ఉద్యమం చేస్తున్నారు. వారికి మద్దతుగా అమెరికా ఎన్నారైలు వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నారు. తొలిసారి  వర్జీనియా రాష్ట్రం లోనిహెర్న్ డన్ నగరంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమం విజయవంతం అయ్యింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా మాజీ ఎమ్మెల్యే , TDP పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ 'బోండా ఉమ' హాజరయ్యారు. 'సతీష్ వేమన' ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు.
పలువురు ఎన్నారైలు స్వచ్ఛందంగా ఇందులో పాలుపంచుకుని రైతులకు తమ నైతికమద్దతు తెలిపారు. దీని అనంతరం వరుసగా మేరీల్యాండ్, వర్జీనియా మరియు వాషింగ్టన్ DC మెట్రో ఏరియాలో మరిన్ని కార్యక్రమాలు జరుగుతాయయని ఎన్నారై ప్రతినిధులు తెలిపారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో మాస్కులు ధరించి, కోవిడ్ జాగ్రత్తలతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.