ఆంధ్రుల కోసం ఆంధ్రుడు... బాబు హిస్ట‌రీలో అమ‌రావ‌తి అధ్యాయం

ఆంధ్ర జాతి కోసం.. ఆంధ్రుల హ‌క్కుల కోసం పోరాడిన వారు ఎవ‌రైనా ఉంటే.. వారిలో అమ‌ర‌జీవి పొట్టి శ్రీరాములు మ‌న‌కు వెంటనే స్ఫురిస్తారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన‌.. ఆ మ‌హ‌నీయుని త‌ర్వాత‌.. అంత‌టి స్థాయిని అందుకునే అర్హ‌త‌..లు కలిగిన వ్యక్తులు లేరు. కానీ ఆ స్థాయిలో కాకపోయినా  ఖ‌చ్చితంగా ఆంధ్రులు గుర్తుపెట్టుకోదగిన వ్యక్తుల జాబితాలో మాత్రం ఉండే వ్యక్తి నిర్వివాదంగా టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబుకు ఉంద‌నే చెప్ప‌చ్చు.

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం రాజీప‌డ‌ని వ్య‌క్తిత్వంతోపాటు.. దూర‌దృష్టి.. రాష్ట్రాన్ని స‌మున్న‌త స్థాయిలో నిల‌బెట్టాల‌నే ఆకాంక్ష ఆయ‌న‌లో మ‌న‌కు మెండుగా క‌నిపిస్తుంది. ఎంతో మంది ముఖ్య‌మంత్రులు ఈ రాష్ట్రాన్ని(ఉమ్మ‌డి) పాలించారు. కానీ, చంద్ర‌బాబు లాగా ఆలోచించిన వారు.. ఓటు దృష్టి, సంక్షేమ దృష్టే కాకుండా... దూర‌దృష్టి  తో ఆలోచించిన వ్యక్తి చంద్రబాబు. సైబ‌రాబాద్ వంటి మ‌హాన‌గ‌రం అవసరాన్ని రెండు దశాబ్దాల క్రితమే గుర్తించిన చంద్రబాబుది అరుదైన ఆలోచన విధానం.

ఈ రోజు బాగుంది.. ఈ రోజు బాగున్నా.. మ‌రి రేప‌టి మాటేంటి?  ముందు త‌రాల ప‌రిస్థితి ఏంటి? అనే ఆలోచ‌న.. విజ‌న్‌.. చంద్ర‌బాబుకే సొంత మ‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మ‌హోన్న‌త న‌గ‌రంగా రాజ‌ధాని భాసిల్లాల‌ని భావించి త‌ప‌న ప‌డ్డారు. రాష్ట్రానికి న‌డిబొడ్డున గుంటూరు-కృష్ణా జిల్లాల మ‌ధ్య అమ‌రావ‌తిని ఏర్పాటు చేశారు. అంతేకాదు.. రాజ‌ధానిని సువిశాలంగా ఆయ‌న ప్లాన్ చేయ‌డం వెనుక‌.. నిశితంగా ఆలోచిస్తే.. దాదాపు 100 సంవ‌త్స‌రాల భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకుని.. అడుగులు వేసిన‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తుంది. అనేక ఐటీ ప‌రిశ్ర‌మ‌లు,.. హోట‌ళ్లు.. ప‌ర్యాట‌క రంగం.. విద్య‌.. ఇలా స‌మున్న‌తంగా అన్ని రంగాలు వ‌ర్ధిల్లాల‌ని ఆయ‌న భావించారు.

అయితే.. ప్ర‌భుత్వం మారిపోవ‌డంతో అమ‌రావ‌తి ఊసు లేకుండా పోగా.. ఏకంగా రాజ‌ధానికే ఎస‌రు పెట్టేసింది వైసీపీ ప్ర‌భుత్వం. దీంతో చంద్ర‌బాబు.. రాజ‌ధాని ని నిల‌బెట్టుకోవ‌డం కోసం.. త‌ప‌న ప‌డ్డారు. అన్ని మార్గాల్లోనూ రాజ‌ధాని కోసం.. త‌న గ‌ళాన్ని వినిపించారు. ప్ర‌తి ఒక్క‌రినీ క‌దిలించారు. ఏనాడూ.. ఆయ‌న అసెంబ్లీలో భావోద్వేగానికి గురికాలేదు. కానీ.. రాజ‌ధాని విష‌యంలో ఆయ‌న తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు.

ముఖ్య‌మంత్రి త‌న‌క‌న్నా.. వ‌య‌సులో చిన్న‌వాడే అయినా.. `చేతులు ఎత్తి న‌మ‌స్క‌రిస్తున్నాను. అమ‌రావ‌తిని నాశ‌నం చేయొద్దు`` అని వేడుకున్నారు. అంతేకాదు.. అమ‌రావ‌తిని అభివృద్ధి చేసి.. మీ పేరే పెట్టుకోండి! అని సూచించారు. ఇది ప్రజల కోసం బాబులో కనిపించిన స్వార్థం. ఆంధ్రుల అభ్యున్న‌తి త‌ప్ప‌.. మ‌రేమీ ఆ ఆవేదనలో చూడలేం.

అయినా.. జ‌గ‌న్ స‌ర్కారుకు మ‌న‌సు క‌ర‌గ‌లేదు. దీంతో బాబు ఉద్య‌మాన్ని ప్రారంభించారు. త‌న జీవితంలో ఏ నాడూ.. రోడ్డు మీద‌కు వ‌చ్చి.. జోలె ప‌ట్ట‌ని చంద్ర‌బాబు.. రాజ‌ధానిని నిల‌బెట్టుకునేందుకు, ఉద్య‌మానికి మ‌ద్ద‌తుగా ఉండేందుకు.. రోడ్డు మీద‌కు వ‌చ్చి.. ఆర్థికంగా ఉద్య‌మ‌సాయానికి జోలె ప‌ట్టారు. చంద్ర‌బాబు స‌తీమ‌ణి.. భువ‌నేశ్వ‌రి.. త‌న చేతుల‌కు ఉన్న బంగారు గాజుల‌ను తీసి ఇవ్వ‌డం.. నిజంగా ఓ అజ‌రామ‌ర ఘ‌ట్టం! 70 ఏళ్లు దాటిన వ‌య‌సులో.. కూడా ఇంకా.. రాజ‌ధాని కోసం.. చంద్ర‌బాబు పోరాడుతున్నారంటే.. ఆయ‌న ఏంఆశిస్తున్నార‌నేది స్ప‌ష్టం అవుతూనే ఉంది. కేవ‌లం ఆంధ్ర‌జాతి కోసం.. ఆయ‌న అడుగులు వేస్తున్నారు.

చంద్ర‌బాబు శ్వాస‌.. ధ్యాస కూడా..నిర్ద్వంద్వంగా ఆంధ్ర‌నాడే! దాదాపు 14 ఏళ్ల‌పాటు ముఖ్య‌మంత్రిగా ఆయ‌న రికార్డు సృష్టించినా.. అమ‌రావ‌తి ఉద్య‌మాన్ని అడుగడుగునా.. ముందుండి.. వెనుకుండి.. న‌డిపిస్తున్న తీరు.. చంద్ర‌బాబుకు అమ‌రావ‌తి చ‌రిత్ర‌లో ఓ అధ్యాయాన్నే ఏర్పాటు చేసింది. అటు చ‌ట్టం ప‌రంగా.. ఇటు న్యాయం ప‌రంగా కూడా చంద్ర‌బాబు వేస్తున్న అడుగులు విజ‌యవంతం అవుతాయ‌నే.. ఉద్య‌మానికి ఏడాది పూర్తయిన సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క‌రూ అభిల‌షిస్తున్నారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.