• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బాలీవుడ్ సినిమాల ఫ్యూచర్ ఎంత వరస్ట్ గా ఉండబోతోందో చెప్పిన వర్మ

admin by admin
May 13, 2022
in Movies, Top Stories
0
0
SHARES
291
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అగ్గిపుల్ల‌…కుక్క‌పిల్ల‌….స‌బ్బు బిళ్ల …కాదేదీ క‌విత‌క‌న‌ర్హం అన్న‌ది ఔట్ డేటెడ్ కొటేష‌న్….సెక్స్.. .సినిమాలు… రాజ‌కీయాలు.. కావేవి వ‌ర్మ విమ‌ర్శ‌ల‌క‌న‌ర్హం…అన్న‌ది అప్డేటెడ్ కొటేష‌న్. టాలీవుడ్, బాలీవుడ్‌ల‌లో మోస్ట్ కాంట్ర‌వ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్‌గా పేరున్న వ‌ర్మ‌…ఇటీవల సినిమా టికెట్ల రేట్ల వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. ఇక, తాజాగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలోని కొందరు బాలీవుడ్ పై చేస్తున్న కామెంట్లు కాక రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంలోకి బాలీవుడ్, టాలీవుడ్ లలో తన మార్క్ చాటుకున్న వర్మ ఎంట్రీ ఇచ్చారు.

బాలీవుడ్ పని అయిపోయిందంటూ వర్మ చేసిన ట్వీట్ వైరల్ అయింది. ‘పుష్ప’ సినిమా ఘన విజయం సాధించినప్పటి నుంచి బాలీవుడ్ పై సెటైర్లు వేస్తున్న వర్మ…’ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్2’ చిత్రాలు హిట్ కావడంతో దూకుడు పెంచారు. దక్షిణాది చిత్రాలు ఘన విజయం సాధించడం, ఉత్తరాది చిత్రాలు డీలా పడటం చూస్తుంటే… కేవలం ఓటీటీల కోసమే బాలీవుడ్ సినిమాలను తెరకెక్కించే రోజులు వచ్చేలా ఉన్నాయంటూ వర్మ చేసిన తాజా కామెంట్లు పెను దుమారం రేపుతున్నాయి.

బాలీవుడ్ ని దక్షిణాది సినిమాలు డామినేట్ చేస్తున్నాయన్న వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో వర్మ చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. శివ, క్షణక్షణం, సత్య, అనగనగా ఒక రోజు, దెయ్యం వంటి హిట్ చిత్రాలు అందించిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడో చచ్చిపోయాడని వర్మ అంటున్నారు. ప్రతి సినిమా తర్వాత తాను మారిపోతానని, మెదడులో తట్టిన ఆలోచనల్నే కథలుగా మలుస్తానని చెబుతున్నారు. ఓ ప్రముఖ చానెల్ నిర్వహించిన షోలో పాల్గొన్న వర్మ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎవరైనా తనను చంపడానికి వస్తే తాను పారిపోనని, వచ్చిన వ్యక్తి తనను కత్తితో పొడిస్తే.. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఆస్వాదించి చచ్చిపోతానని వర్మ చేసిన తిక్క కామెంట్లు వైరల్ అయ్యాయి. రాజ్యాంగం తనకిచ్చిన హక్కులు వాడుకుంటానని, ఎదుటి వాళ్లు బాధపడతానుకుంటే అసలు ఏమీ మాట్లాడలేమని అన్నారు. టికెట్ల ధరల పెంపుపై కేవలం ప్రజలకు మధ్యవర్తిగానే మంత్రిని కలిశానని అన్నారు. తన నిర్ణయం కొందరికి నచ్చుతుందని, ఇంకొందరికి నచ్చదని అన్నారు.

తాను ఎన్నికల్లో నిలబడినా బుద్ధి ఉన్నోళ్లెవరూ తనకు ఓటెయ్యరని, తాను జనాల కోసం ఏమీ చేయనన్న విషయం వారికి బాగా తెలుసని అన్నారు వర్మ. తన కోసం తాను బతుకుతున్నానని, రాజకీయ నాయకుల లక్షణం అది కాదని చెప్పారు. తనలాగా బతకాలంటే దేవుడు, సమాజం, కుటుంబం వంటి వాటిని వదిలేయాలని, అప్పుడు వచ్చే స్వేచ్ఛతో తన లాగా బతకవచ్చని వర్మ తెలిపారు.

Tags: bollywood movies in ottdirector ram gopal varmasouth movies dominationvarmavarma comments on bollywoodvarma shocking comments
Previous Post

కరాటే కల్యాణి అంత మాటందా? యూట్యూబర్ శ్రీకాంత్ షాకింగ్ ఆరోపణలు

Next Post

NRI TDP USA-బోస్ట‌న్‌ లో మే 20-21 తేదీల్లో ‘మ‌హానాడు’ వేడుక‌లు!

Related Posts

Movies

హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్

June 18, 2025
Andhra

జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు

June 17, 2025
Andhra

ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!

June 17, 2025
Andhra

జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!

June 17, 2025
Andhra

ఇకనైనా కొమ్మినేని మారతారా?

June 17, 2025
Andhra

చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్?

June 17, 2025
Load More
Next Post

NRI TDP USA-బోస్ట‌న్‌ లో మే 20-21 తేదీల్లో 'మ‌హానాడు' వేడుక‌లు!

Please login to join discussion

Latest News

  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
  • జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు
  • ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!
  • జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!
  • లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత
  • ఇకనైనా కొమ్మినేని మారతారా?
  • చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్?
  • పవన్ కోసం సరికొత్త విలన్
  • ‘పెద్ది’కి డేట్‌ వదిలేస్తున్న ప్యారడైజ్
  • జ‌న‌సేన ముచ్చ‌ట‌.. కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోవ‌ట్లేదా ..!
  • చంద్రబాబుకు ఒవైసీ ఉచిత స‌ల‌హా
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra