• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కరాటే కల్యాణి అంత మాటందా? యూట్యూబర్ శ్రీకాంత్ షాకింగ్ ఆరోపణలు

admin by admin
May 13, 2022
in Movies, Top Stories
0
0
SHARES
720
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సినీ నటి కరాటే కల్యాణి, యూట్యూబ్ ప్రాంక్ స్టర్ శ్రీకాంత్ రెడ్డిల మధ్య వివాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. హైదరాబాదులోని ఎస్సార్ నగర్ పరిధిలోని మధురానగర్ లో వీరిద్దరూ గొడవపడి…నడిరోడ్డుపైనే కొట్టుకున్న ఘటన వైరల్ అయింది. ప్రాంక్ వీడియోల పేరిట మహిళలతో అసభ్య వీడియోలు చేస్తున్నారంటూ అతడిపై కల్యాణి దాడి చేశారు. యూసుఫ్‌గూడలోని ఓ బస్తీలో వీడియోలు చేస్తుండగా.. సినీ నటి కల్యాణి మరో ఇద్దరు కలిసి వచ్చి శ్రీకాంత్‌రెడ్డిపై దాడికి పాల్పడ్డారు.

తొలుత శ్రీకాంత్ రెడ్డిని కరాటే కల్యాణి చెంప దెబ్బ కొట్టడంతో మొదలైన గొడవ క్రమంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకునే దాకా వెళ్లింది. వీరిద్దరూ ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్న వైనం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీంతో, ఆ ఘటనపై శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. మహిళలను కించపరిచేలా వీడియోలు చేస్తున్నావంటూ కల్యాణి తనను దూషించిందని, అయితే, సినిమాల్లో కల్యాణి చేసే సీన్లు మాత్రం బాగున్నాయా? అని తాను ప్రశ్నించానని తెలిపారు.

ఈ క్రమంలోనే తమ మధ్య గొడవ జరిగిందిని, తనను లక్ష రూపాయలివ్వాలని కల్యాణి డిమాండ్ చేసిందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోతే హైదరాబాదులో తిరగనివ్వనని, తనపై రేప్ కేసులు పెట్టిస్తానని బెదిరించిందని ఆరోపించారు. తనకు మహిళా సంఘాలతో మంచి పరిచయాలు ఉన్నాయని వార్నింగ్ ఇచ్చిందని అన్నారు. ఆ తర్వాత ఆమె పక్కనున్న ఒక వ్యక్తి రూ. 70 వేలు ఇచ్చి మ్యాటర్ సెటిల్ చేసుకోమని చెప్పాడని, తాను డబ్బులు ఎందుకివ్వాలని ప్రశ్నించినట్లు చెప్పారు.

ఆ తర్వాత ఆమె తనను కొట్టిందని, పక్కనున్న వాళ్లు కర్రలు తీసుకుని తనను కొట్టేందుకు యత్నించారని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. బతుకు తెరువు కోసం తాను వీడియోలు చేస్తుంటానని, వీడియోలు చేయాలని అమ్మాయిలు తమ వద్దకు వస్తుంటారని చెప్పుకొచ్చారు. డబ్బులు తీసుకుని తాను వీడియోలు తయారు చేస్తుంటానని, తన వల్ల వీడియో ఎడిటర్, కెమెరామెన్ కు ఉపాధి లభిస్తోందని చెప్పారు.

తనను చంపేస్తానని బెదిరించిందని, కల్యాణి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదనే విషయాన్ని అందరికీ తెలియజేయాలనే ఈ వీడియోను విడుదల చేస్తున్నానని చెప్పారు.

Tags: actress karate kalyanicase on karate kalyanikarate kalyani thrashedprank videos issueshocking allegationsyoutuber srikanth reddy
Previous Post

బండి సంజయ్ కు కేటీఆర్ 48 గంటల డెడ్ లైన్…లేదంటే…

Next Post

బాలీవుడ్ సినిమాల ఫ్యూచర్ ఎంత వరస్ట్ గా ఉండబోతోందో చెప్పిన వర్మ

Related Posts

Top Stories

జగన్ ఇలాకాలో లోకేష్ సీమ గర్జన…వరాల జల్లు

June 7, 2023
Trending

జగన్ పాలనలో ఆ ర్యాంకు పాతాళానికి పడిపోయింది:చంద్రబాబు

June 7, 2023
jagan salute
Top Stories

ముందస్తు ఎన్నికలపై జగన్ తాజా కామెంట్స్…అదే వ్యూహమా?

June 7, 2023
Top Stories

జగన్ కు దేవినేని ఉమ సెల్ఫీ ఛాలెంజ్

June 7, 2023
Top Stories

సాయం చేసి… శవాలు చూసి… వారికి ఏమైందంటే.

June 7, 2023
Movies

తిరుపతిలో హీరోయిన్ తో ఓం రౌత్ పాడు పని…వివాదం

June 7, 2023
Load More
Next Post

బాలీవుడ్ సినిమాల ఫ్యూచర్ ఎంత వరస్ట్ గా ఉండబోతోందో చెప్పిన వర్మ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • మిషన్ రాయలసీమతో సీమ కష్టాలకు శాశ్వత పరిష్కారం – నారా లోకేష్!
  • జగన్ ఇలాకాలో లోకేష్ సీమ గర్జన…వరాల జల్లు
  • జగన్ పాలనలో ఆ ర్యాంకు పాతాళానికి పడిపోయింది:చంద్రబాబు
  • ముందస్తు ఎన్నికలపై జగన్ తాజా కామెంట్స్…అదే వ్యూహమా?
  • వివేకా కేసులో మరో ట్విస్ట్..ఆ టెస్ట్ కు కోర్టు ఓకే!
  • జగన్ కు దేవినేని ఉమ సెల్ఫీ ఛాలెంజ్
  • మహిళలకు వైసీపీ ఎమ్మెల్యే శాపనార్థాలు
  • సాయం చేసి… శవాలు చూసి… వారికి ఏమైందంటే.
  • తిరుపతిలో హీరోయిన్ తో ఓం రౌత్ పాడు పని…వివాదం
  • కాంగ్రెస్ కు ఊహించని షాక్!
  • `ఏఐ` ఎంత ప్రాణాంత‌క‌మో చెప్పిన బ్రిట‌న్ ప్ర‌ధాని స‌ల‌హాదారు!
  • ‘బాలయ్య’ బర్త్ డే న్యూ యార్క్ టైం స్క్వేర్ లో!
  • యువతలో ‘లోకేష్’ పట్ల క్రేజ్ అద్భుతం-‘డాక్టర్ హరిప్రసాద్ కుట్టాంబాకం’
  • మరో 3 వేల కోట్లు అప్పు…. జగన్ పై విమర్శలు
  • ఆమె మృతిపై డీజీపీకి చంద్రబాబు లేఖ

Most Read

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

ఏపీలో పెల్లుబుకుతున్న `అస‌హ‌న రాజ‌కీయం`.. రీజ‌నేంటి?

ఆ మెగా హీరోతో లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్?

టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra