అదానీ, అంబానీలకు బీజేపీ ప్రభుత్వం ఇండియాను అమ్మేస్తోంది అని పెద్దఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అనేక కంపెనీల ప్రైవేటైజేషన్ నిర్ణయాలు మన కళ్ల ముందు కనిపిస్తున్నాయి.
ఈ విమర్శలకు బీజేపీ వద్ద సమాధానం లేదు. అందుకే ఎవరు ఏమనుకున్నా తనంతట తాను అమ్ముకుంటూ పోతోంది. విమర్శలను పట్టించుకోవడం లేదు.
తమాషా ఏంటంటే… ఒక వైపు ప్రభుత్వ ఆస్తులు అన్నీ అమ్ముతున్నా దేశం అప్పులు తగ్గకపోగా పెరుగుతున్నాయి. ఆ డబ్బు ఎటుపోతోందో తెలియని దారుణమైన పరిస్థితి ఉంది.
ఈ నేపథ్యంలో సైలెంటుగా అమ్ముకుని ముందుకు పోతున్న బీజేపీకి తొలిసారి తాను మాట్లాడే అవకావం దక్కించుకుంది. టాటా గ్రూపు ఈ దేశంలో తొలిసారిగా ప్రారంభించిన ఎయిర్ ఇండియాను తాజాగా మోడీ సర్కారు వారికే అమ్మేసింది. వాస్తవానికి ఎక్కువ కోట్ చేసి టాటాయే దానిని దక్కించుకున్నారు అని చెప్పడం కరెక్ట్.
లేకపోతే ఇది కూడా అంబానీకో, అదానీకో పోయేది. టాటా ఎయిర్ ఇండియాను దక్కించుకున్న నేపథ్యంలో ప్రజలెవరూ దీనిపై విమర్శలు చేయకపోవడంతో ఇదే అదనుగా కాంగ్రెస్ పార్టీపై బీజేపీ దండయాత్ర చేసింది. దానికి కాంగ్రెస్ పాత ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ తాను క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తోంది.
మొత్తానికి బీజేపీకి ఇన్నాళ్లకు ఒక అవకాశం దక్కిందని చెప్పాలి.
Modi Government: Cleaning the mess created by successive Congress governments, which were too incompetent to solve any problems themselves. #AirIndia https://t.co/QY6KOvuZp2
— BJP (@BJP4India) October 8, 2021