అనంతపురం జిల్లా తాడిపత్రిలో న్యూ ఇయర్ వేడుకలు రాజకీయ రచ్చకు తెర లేపాయి. టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేకంగా జేసీ ఏర్పాటు చేసిన కార్యక్రమంపై నటి, బీజేపీ నేత మాధవీ లత సోషల్ మీడియా వేదికగా వివాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత జేసీ బస్సులు దగ్ధం కావడం తెలిసిందే.
ఈ విషయంపై జేసీ భగ్గుమన్నారు. తన బస్సుల దహనం వెనుక బీజేపీ నేతల హస్తం ఉందంటూ ఆరోపణలు చేశారు. బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అలాగే నటి మాధవీలత ఒక వ్యాభిచారని, పెద్ద వేస్ట్ క్యాండిడేట్ అంటూ జేసీ హద్దులు దాటి దూషించారు. జేసీ పార్కుకు వెళ్లొద్దని.. అక్కడ ఆడవాళ్లకు సేఫ్టీ లేదని.. పార్క్ వద్ద గంజాయి, డ్రగ్స్ బ్యాచ్‌లు ఉంటాయని మాధవీలత చేసిన వ్యాఖ్యలను జేసీ తీవ్రంగా ఖండించారు. కావాలనే ఆమె తప్పుడు ప్రచారం చేస్తుందని ఫైర్ అయ్యాయి.
అయితే తాజాగా జేసీ వ్యాఖ్యలపై అనంతరం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు స్పందించారు. మాధవీలతపై జేపీ చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. వయసుకు, రాజకీయ అనుభవానికి తగ్గట్లుగా ప్రవర్తించాలని సందిరెడ్డి శ్రీనివాసులు హితవు పలికారు. అధికార పార్టీలో ఉంటూ ప్రభుత్వానికే చెడ్డ పేరు తెచ్చే విధంగా జేసీ ప్రవర్తిస్తున్నారని.. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
జెసి ట్రావెల్స్ బస్సులను దహనం చేయాల్సిన అవసరం బీజేపీ నేతలకు ఏంటని సందిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. అటువంటి వాటిని బీజేపీ ఎప్పుడూ ప్రోత్సహించదన్నారు. బీజేపీ నేతలను ట్రాన్స్‌జెండర్స్‌తో పోల్చడంపై సందిరెడ్డి శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే గౌరవంగా ఉంటుందని జేసీకి సూచించారు. కాగా, మరోవైపు తాడిపత్రి ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకురాలు మాధవీలతపై తాడిపత్రి పోలిస్టేషన్లో రాష్ట్ర ఎస్సీ మాల కార్పోరేషన్ డైరక్టర్ కుంకరి కమలమ్మతో పాటు టీడీపీ మహిళా కౌన్సిల్ కంప్లైంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.