బీజేపీ పార్టీ ఏపీకి చేసినంత మోసం దేశంలో ఏ పార్టీ ఏ ప్రాంత ప్రజలకు చేయలేదు. సరే జాతీయ నాయకులు అంటే నాన్ లోకల్ కాబట్టి వారు చేశారనుకోవచ్చు. కానీ వాస్తవానికి మోడీ గాని, అమిత్ షా గాని ఏపీకి చేసిన మోసం కంటే ఏపీకి చెందిన బీజేపీ నేతలు ఎక్కువ అన్యాయం చేశారు.
బీజేపీ మ్యానిఫెస్టోలో పెట్టిన హామీల విషయాన్ని కూడా వారు వక్రీకరించడం కొసమెరుపు. తమతో గొడవపడే తెలంగాణకు ఇచ్చినన్ని నిధులు కూడా బీజేపీ ఏపీకి ఇవ్వని పరిస్థితి. ప్రస్తుతం ఏపీ ప్రజలు అంతా బీజేపీని వైకాపా టీంగానే నమ్ముతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఇది ఆరోపణ కాదు… సోషల్ మీడియాలో బీజేపిపై ఏపీ ప్రజలకు ఉన్న ముద్ర అదే అని స్పస్టంగాతెలుస్తోంది.
ప్రత్యేక హోదా ఎగవేయడం ఏపీకి జరిగిన అతిపెద్ద మోసం అయితే అమరావతికి అపుడు పోలవరానికి ఇపుడు నిధులు ఎగ్గొట్టడం ఏపీ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఒక డిబేట్లో జర్నలిస్టు మూర్తి… బీజేపీ ప్రధానకార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డిని కడిగిపారేశాడు. బీజేపీ ఏపీకి చేసిన మోసాన్ని సమర్థించలేకపోతున్న విష్ణువర్దన్ రెడ్డిని ఈ వీడియోలో చూడొచ్చు.