ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తరచూ ఏదో ఒక తలనొప్పి వచ్చి పడుతోంది. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పాలనలో దూకుడు ప్రదర్శిస్తున్న ఆయన.. అవసరానికి మించిన ఆరోపణలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అదే సమయంలో పార్టీ నేతల తొందరపాటును ఎప్పటికప్పుడు సర్ది చెప్పటమేకాదు.. వారిని కనుచూపుతో కంట్రోల్ చేస్తున్నారు. అయినప్పటికి ఆయనకు కోర్టుల రూపంలో జగన్ కి ఎదురవుతున్న చిరాకులు అన్నిఇన్ని కావు అంటున్నారు.
దీనికి తోడు తాను ఏదైనా అనుకున్నప్పుడు.. అది జరగకుండా అడ్డుపడే వ్యవస్థలు.. తీరా తాను ఫిక్స్ అయ్యాక.. అవే వ్యవస్థలు మళ్లీ తనను ప్రశ్నిస్తున్న తీరు జగన్ కు ఇబ్బందికరమని చెబుతున్నారు. స్థానిక ఎన్నికల్ని త్వరగా పూర్తి చేద్దామన్న ఊపులో ఏపీఅధికారపక్షం ప్రదర్శించిన హడావుడి అంతా ఇంతా కాదు. కరోనా వేళ.. ఈ ఎన్నికలేంది? ఈ ప్రచారం ఏమిటి? అన్న ప్రశ్నల్ని ఎదుర్కొన్నారు. కరోనా వైరస్ ప్రయాణం ఎంత సుదీర్ఘంగా ఉంటుందన్న విషయం మీద క్లారిటీ ఉన్న సీఎం జగన్.. ఏదోలా ఎన్నికల్నిపూర్తి చేయాలని భావించారు.
కానీ.. దాన్ని తప్పు పట్టి.. అందులో బొక్కలు వెతికే ప్రయత్నం చేయటాన్ని చూసిన ఆయన.. వెనకడుగు వేశారు. కరోనా తగ్గిన తర్వాతే స్థానిక ఎన్నకల్ని నిర్వహించాలన్నట్లుగా ఆ విషయాల్ని వదిలేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీని ప్రకారం అన్ని చోట్ల ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏపీలో ఎందుకు ఎన్నికలు నిర్వహించరన్న ప్రశ్న ఎదురైంది. ఇదే సందేహాన్ని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని వివరణ కోరింది.
ఇదంతా చూసినప్పుడు.. తొలుత నిర్వహించాలని అనుకుంటే.. వద్దని ఆపేశారు. ఇప్పుడేమో కరోనా నేపథ్యంలో కొన్నాళ్లు ఆగుదామన్న ఆలోచనలో ఉంటే.. ప్రజాప్రయోజన వ్యాజ్యం పేరుతో.. ఎన్నికలు నిర్వహించొచ్చు కదా? అన్న ప్రశ్న ఎదురవుతోంది. మొన్నటి వరకుఎన్నికల కోసం అంతలా తాపత్రయ పడిన జగన్.. ఇప్పుడు మౌనంగా ఉండటానికి కారణం.. ఏపీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ ఉన్న నేపథ్యంలో.. ఆయన పదవీకాలం పూర్తి అయ్యే వరకు ఏపీలో స్థానిక ఎన్నికలు నిర్వహించకూడదన్న ఆలోచనలో సీఎం ఉన్నట్లుగా చెబుతున్నారు. మరి.. ప్రభుత్వ వాదన ఏమిటో కోర్టుకు తెలియజేయాలన్న ఆదేశాల నేపథ్యంలో.. ప్రభుత్వం ఏమి చెబుతుందో చూడాలి.