పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటించిన భీమ్లా నాయక్ ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. అభిమానులను వెయిట్ చేయించి చేయించి రిలీజ్ చేశారు. ఏమాటకామాట.. లేట్ అయినా లేటెస్ట్ గా ఉంది, పవర్ ప్యాక్డ్ గా ఉంది. ఇందులో రానా, పవన్ బద్ధ శత్రువులుగా నటిస్తున్నారు.
ట్రైలర్ చాలా నాటకీయంగా కనిపిస్తుంది. ఒక్కో సీను… ఫ్యాన్స్ ని ఆకాశంలో విహరించేలా చేస్తోంది. ’’వాడికి యూనిఫాం వేసి కంట్రోల్ పెట్టాం. నువ్వు ఆ యూనిఫాం తీసేశాడు, వాడిని తట్టుకోవడం కష్టం‘‘ అని ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోయే డైలాగ్ అదిరిపోయింది. అలాంటి క్రేజీ యాక్షన్ సీన్స్ మొత్తం చాలా వరకు ఆశించవచ్చు.
నిత్యా మీనన్ ట్రైలర్లో ఒక సర్ ప్రైజ్. ఆమెకు మంచి పాత్ర దక్కింది.
ట్రైలర్ లోనే తగిన వినోదం, యాక్షన్ సన్నివేశాలు, డ్రామా ఇలా ఏది తక్కువ కాలేదు. దానికి తోడు కిక్కిచ్చే BGM సన్నివేశాలకు ప్రాణం పోసింది. ప్రొడక్షన్ డిజైన్ లావిష్ గా కనిపిస్తోంది. ట్రైలర్ చూస్తేనే సినిమా చూసినంత ఆనందం కలుగుతోంది.
ఇందులో గమనించాల్సిన పాయింట్ ఏంటంటే… భీమ్లా నాయక్ 2020 మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్‌కి రీమేక్. దివంగత దర్శకుడు సచి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
తెలుగు వెర్షన్‌కి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ మరియు స్క్రీన్ ప్లే రాశారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించారు.
పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ రవి కె. చంద్రన్ మరియు నవీన్ నూలి నిర్వహిస్తున్నారు.
మొత్తానికి ఇదో బిగ్ ఫీస్ట్. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాను ఫ్లాప్ చేయాలి అన్న జగన్ కల నెరవేరేలా కనిపించడం లేదు.
????????????#BheemlaNayak #NBK107 pic.twitter.com/PA7tCKQlDa
— Zee Telugu News (@ZeeTeluguLive) February 21, 2022