భారతదేశం 100 కోట్ల వ్యాక్సిన్లను పూర్తి చేసింది.
ఈ విజయంలో మేజర్ పార్ట్ రెండు కంపెనీలది.
ఒకటి కోవాక్సిన్ తయారుచేసిన భారత్ బయోటెక్ కంపెనీది, కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారుచేసిన పూనావాలా కంపెనీది
కోవిడ్ -19 వ్యాక్సిన్ కోవాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ గురువారం దీనిపై స్పందిస్తూ కోవిడ్ టీకాలు వేయడంలో భారతదేశం ఒక బిలియన్ మార్కును చేరుకోవడంలో భాగస్వాములు అయినందుకు గర్వంగా ఉందని పేర్కొంది.
కేవలం తొమ్మిది నెలల్లో ఒక బిలియన్ మార్కును చేరుకోవడం భారతదేశానికి విశేషమైన విజయమని హైదరాబాదుకు చెందిన వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ వ్యాఖ్యానించింది.
ఈ విజయం ఏ ఒక్కరిదీ కాదు… ప్రభుత్వం, వ్యాక్సిన్ తయారీదారులు, ఆరోగ్య సంరక్షణ కార్మికులు మరియు భారతదేశంలోని టీకాలు వేయించుకున్న పౌరులందరి ఐక్య ప్రయత్నం, ఇది ఆత్మనిర్భర్ భారత్ యొక్క నిజమైన విజయగాథ అని భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా అన్నారు.