ఇప్పుడు ఇదే అంశంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. సినీనటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన అతీగతీ లేని రాజకీయం చేస్తోంది. సినిమాల్లో హీరోల పక్కన సపోర్టింగ్ రోల్స్ చేసే క్యారెక్టర్లు ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన సైతం ప్రధాన రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేసే సపోర్టింగ్ పార్టీగా మారిపోయిందా ? అంటే అవుననే అనక తప్పదు.
2014లో పార్టీ పెట్టాక పవన్ ఆ ఎన్నికలకు దూరంగా టీడీపీ+బీజేపీ కూటమికి సపోర్ట్ చేశారు. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీకి దగ్గరయ్యారు.
ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పవన్ తిరుపతిలో పోటీ చేసి ప్రజల్లోకి వెళ్లి పోటీ చేయవచ్చు. అమరావతి, పోలవరం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశాల ఎజెండాగా పవన్ తిరుపతిలో పోటీ చేస్తే పార్టీకి మంచి మైలేజ్ వచ్చేది. అయితే పవన్ చేతులు ఎత్తేశాడు.
తిరుపతిలో జనసేన పోటీ చేసేందుకు పవన్ రెండు, మూడు సార్లు ఢిల్లీ వెళ్లీ నానా హంగామా చేశాడు. పవన్ ను ఏ మాత్రం లెక్కలోకి తీసుకోకుండా ఏపీ బీజేపీ తాము తిరుపతిలో పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. కట్ చేస్తే ఇప్పుడు ఎన్ని మలుపులు తిరిగినా తిరుపతి ఎంపీ సీటు బీజేపీకే దక్కింది.
సినిమాల్లో హీరోల పక్కన సపోర్టింగ్ రోల్స్ చేసే వాళ్లు సినిమాకు ఎంతో కీలకం అవుతారు. సినిమాల్లో స్టార్‌గా ఉన్న పవన్ ఇప్పుడు రాజకీయాల్లో మాత్ర ఉత్తమ పొలిటికల్ సపోర్టింగ్ రోల్స్ చేసే నేతగా మిగిలిపోతున్నారా ? అన్న సందేహాలు కలుగుతున్నాయి.
గ్రేటర్ ఎన్నికల్లో కూడా జనసేనను బీజేపీ ఘోరంగా అవమానించినా చివరకు మద్దతు ఇవ్వక తప్పలేదు. ఇప్పుడు తిరుపతిలోనూ అదే జరిగింది. బీజేపీ జనసేనను ఎంత లైట్ తీస్కొన్నా చివరకు బీజేపీకే మద్దతు ఇచ్చింది.
ఓ వైపు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ చేస్తోన్న అన్యాయానికి ఆ పార్టీపై రాష్ట్ర ప్రజలు గుర్రుగా ఉన్నారు. బీజేపీకి ఇప్పుడు పవన్ సపోర్ట్ చేయడం ద్వారా ఆ పార్టీ ఏపీకి చేస్తోన్న అన్యాయానికి సపోర్ట్ చేస్తున్నారా ? అన్న విమర్శలు కూడా వస్తున్నాయి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో పవన్ సపోర్ట్ చేసినా బీజేపీకి ఎవ్వరూ ఓట్లేయరు. పవన్ నిర్ణయం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నెత్తిన పాలు పోసినట్లు అయింది. ఏదేమైనా పవన్ మరోసారి తాను బెస్ట్ పొలిటికల్ సపోర్టింగ్ క్యారెక్టర్‌గా మిగిలిపోయారు.