షాకింగ్ ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. దాదాపు రూ.కోటి విలువైన కారును మంటల్లోకి చిక్కుకున్న వైనం షాకింగ్ గా మారింది. అత్యంత విలాసవంతమైన కార్ల బ్రాండ్లలో ఒకటైన బెంజ్ కారును రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉంచగా.. తగలబడిన వైనం షాకింగ్ గా మారింది. ఉత్తరప్రదేశ్ లోని నొయిడాలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. దీంతో ఆశ్చర్యపోయిన యజమాని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో వారు ఆ కారును పార్క్ చేసిన దగ్గర్లోని కెమేరాలో సీసీ ఫుటేజ్ చూడగా షాకింగ్ నిజం ఒకటి బయటకు వచ్చింది. టూ వీలర్ మీద హెల్మెట్ పెట్టుకున్న ఒక వ్యక్తి వచ్చి.. బాటిల్ లో నుంచి పెట్రోల్ ను కారు మీద ఒలకబోసి.. నిప్పు పెట్టేసిన పారిపోయిన వైనాన్ని గుర్తించారు. ఇంతటి దారుణం ఎందుకు చేశాడు? అతడెవరు. అన్న విషయంలోకి వెళితే.. కారు యజమాని వద్ద పని చేసిన వ్యక్తిగా గుర్తించారు.
అతడికి కారు యజమాని రూ.2లక్షల వరకు కూలి డబ్బులు ఇవ్వాల్సి ఉందని గుర్తించారు. తనకు ఇవ్వాల్సిన కూలి డబ్బుల్ని ఇవ్వలేదన్న కోపంతో కోటి రూపాయిల విలువైన కారును తగలెబ్టేసినవైనాన్ని పోలీసులు గుర్తించారు. అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. 2020లో ఇంట్లో టైల్స్ వేసిన పనికి తనకు రూ.2లక్షలు ఇవ్వాల్సి ఉందని.. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా సతాయించటంతో విసుగు చెందిన తానీ పని చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ విషయాల్ని పోలీసులు వెల్లడించారు. డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో చేసిన పనికి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు.