నేడు దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే భక్తి శ్రద్ధలతో గణనాథుడిని భక్తులు పూజిస్తున్నారు. తమకు విఘ్నాలు కలగకుండా చూడాలని పూజలు చేస్తున్నారు. బొజ్జ గణపయ్యను ప్రసన్నం చేసుకునేందుకు ఉండ్రాళ్లు వగైరాలు నైవేద్యాలుగా పెడుతున్నారు. ఇక, వినాయకుడి విగ్రహాన్ని 21 రకాల పత్రితో పూజిస్తున్నారు. అయితే, వినాయక పూజలో వాడే 21 రకాల పత్రికి విశేషమైన ఔషధ గుణాలు ఉన్నాయని చాలా కొద్ది మందికే తెలుసు.
పత్రి అంటే ఒక్క ఆకు మాత్రమే అని, 21 రకాల ఆకులు ఒక్కొక్కటి చొప్పున కొయ్యాలన్న సంగతి చాలామందికి తెలియదు. ఇష్టమొచ్చినట్లు పువ్వులు, పిందెలు, పళ్ళు ఉన్న కొమ్మల్ని కోసి పూజకి ఉపయోగించకూడదన్న విషయం ఈ తరంలో చాలామంది తెలీదంటే అతిశయోక్తి కాదు. పత్రిని ముట్టుకోవడం,వాటి నుంచి వచ్చే వాసన పీల్చడం అనారోగ్యాలకు ఔషధమని పెద్దలు అంటుంటారు. అందుకే, ఈ వినాయక చవితి సందర్భంగా వినాయక పూజలో ఉపయోగించే 21 రకాల పత్రి…వాటి ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం.
1.మాచీ పత్రం:-మాచి పత్రి అనేది తెలుగు పేరు. చేమంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసనా భరితంగా ఉంటాయి.
ఉపయోగాలు:-ఈ ఆకుని పసుపు, నువ్వుల నూనెతో కలిపి నూరి ఆ ముద్దను చర్మ వ్యాధులు ఉన్న చోట రాస్తే త్వరగా వ్యాధి నివారణ అవుతుంది.
ఉపయోగాలు:-
• వాత రోగాలు తగ్గిస్తుంది
• ఇది నేత్ర సంబంధ రోగాలకు అద్భుత నివారిణి. మాచీ పత్రాన్ని నీళ్లలో తడిపి కళ్లకి కట్టుకుంటే నేత్రవ్యాధులు నయమవుతాయి.
• వ్రణాలు, క్రిమిహారి, దద్దుర్లు, వాత రోగాలు, నులిపురుగులను తగ్గిస్తుంది+
• అతి దాహాన్ని హరిస్తుంది.
• కొన్ని రకాల జ్వరాలను కూడా ఇది తగ్గించగలదు.2.బృహతీ పత్రం:బృహతి పత్రం అంటే “వాకుడాకు”. దీనిని ములక అంటారు. దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని రెండు రకాలున్నాయి. పత్రాలు వంగ ఆకులు మాదిరి. తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో వుంటాయి.
ఉపయోగాలు:- ఈ పత్రం వలన ప్రయోజనం దగ్గు, జలుబు, జ్వరం, అజీర్ణం, మూత్ర సంబంధిత వ్యాధులు, నేత్ర సంబంధిత వ్యాధులను నయం చేయడానికి ఉపయోగ పడుతుంది. ఇది దంత ధావనానికి కూడా ఉపయోగపడుతుంది.
3.బిల్వ పత్రం:
బిల్వ పత్రం అంటే మారేడు ఆకు. మూడు ఆకులుగా, ఒక ఆకుగా ఉంటాయి. ఇవి శివునికి చాలా ఇష్టం శ్రీ మహాలక్ష్మీదేవికి కూడ ఇష్టమైందిగా చెపుతారు.
ఈ పత్రి యొక్క ఔషధ గుణాలు :
అతిసార వ్యాధికి దీని పండ్ల రసం చాలా మంచి మందు.
దీని ఆకుల రసము చక్కెర వ్యాధి నివారణకు చాలా మంచిది
మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి.
బిల్వ వృక్షములో ప్రతి భాగము మానవాళికి మేలు చేసేదే.
• మారేడుదళము గాలిని, నీటిని దోషరహితము చేస్తుంది.
• మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి
• అతిసార వ్యాధికి దీని పండ్ల రసం చాలా మంచి మందు
• ఆయుర్వేదములో వాడు దశమూలము లలో దీని వేరు ఒకటి.
• మొలలకు ఇది మంచి ఔషధము.
• దీని ఆకుల రసము చక్కెర వ్యాధి నివారణకు చాలా మంచిది.
• బిల్వ ఆకులు జ్వరాన్ని తగ్గిస్తాయి . . . బిల్వ ఆకుల కషాయము తీసి అవసరము మేరకు కొంచం తేనె చుక్కలు కలిపి తాగితే జ్వరము తగ్గుతుంది
• కడుపు లోను, పేగుల లోని పుండ్లు తగ్గించే శక్తి బిల్వ ఆకులకు, ఫలాలకు ఉన్నది,
• మలేరియాను తగ్గించే గుణము బిల్వ ఆకులకు, ఫలాలకు ఉన్నది,
• బిల్వ ఫలం నుండి రసం తీసి దానికి కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే రక్తసంబంధిత ఇబ్బందులనుండి ఉపశమనం కలుగుతుంది
• బిల్వ వేరు, బెరడు, ఆకులను ముద్దగా నూరి గాయాల మీద అద్దితే త్వరగా మానుతాయి.
• క్రిమి, కీటకాల విషానికి విరుగుడుగా పనిచేస్తుంది .
• మారేడు దళాన్ని సోమవారము, మంగళ వారము, ఆరుద్రానక్షత్రము, సంధ్యాసమయము, రాత్రి వేళలందు, శివరాత్రి రోజున, సంక్రాంతి రోజున, పండుగల సమయాన కోయకూడదు. కనుక ఈ దళాలను ముందు రోజు కోసి, భద్రపరచిన దళాలతో పరమశివుని పూజిస్తారు.
4.దూర్వా పత్రం:
దూర్వా పత్రం అంటే గరిక. తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలుంటాయి. గడ్డిజాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవి.
ఉపయోగాలు:-
గ్రహణ సమయంలో వెలువడే విషాన్ని అడ్డుకోగల శక్తి గరికకి ఉంది…ముక్కునుంచి కారే రక్తాన్ని ఆపగలదు గరిక రసం,తలనొప్పి,గాయాల్ని త్వరగా మాన్పడం,సెప్టిక్ కాకుండా ఆపుతుంది,నోటిపూత,చర్మ వ్యాధులకి ,పొట్టలో ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది,కిడ్నీ రాళ్ళని కరిగిస్తుంది.
5.దుత్తూర పత్రం:
దుత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. ఇది వంకాయ జాతికి చెందింది.+
ముళ్ళతో కాయలు వంకాయ రంగు పూలు వుంటాయి.
• ఆస్తమాను తగ్గిస్తుంది
• ఊపిరితిత్తుల సంబంధ సమస్యలను తగ్గిస్తుంది
• మానసిక వ్యాధి నివారణకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
6.బదరీ పత్రం:
బదరీ పత్రం అంటే రేగు. దీనిలో రేగు, జిట్రేగు, గంగరేగు అని మూడు రకాలు ఉంటాయి.
• ఇవి బరువు పెరగడంలో, కండరాలకు బలాన్నివ్వడంలో, శారీరక శక్తినివ్వడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.
• కాలేయం పనిని మరింత చురుకు చేయడానికి చైనీయులు ప్రత్యేకంగా రేగిపండ్లతో చేసిన టానిక్‌ను ఎంచుకుంటారు.
• ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని జపనీయుల పరిశోధనలో తేలింది. ఇవి విరుగుడుగా,కఫోత్సారకంగా, మూత్ర స్రావకానికి ప్రేరకంగా ఉపయోగపడుతుంది.
• అంతేకాదు బాధానివారిణి, క్యాన్సర్ వ్యతిరేకి, ఉపశమనకారి. ఇది రక్తాన్ని శభ్రం చేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. ఆకలి లేమి, రక్తహీనత, నీరసం, గొంతునొప్పి, శ్వాసనాళాల వాపు, విసుగు, హిస్టీరియా వంటి వాటి నివారణా+
మందులలో దీన్ని వాడతారు.
• విత్తనాలు కూడా అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. నిద్రలేమి నివారణకు విత్తనాలను వాడతారు. అజీర్తిని అరికట్టడంలో దాని వేర్లను ఉపయోగిస్తారు.
• వేర్లను పొడి చేసి పాత గాయాలకు పెడితే త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఆకులు జ్వరసంహారిగా ఉపయోగపడతాయి.
7.అపామార్గ పత్రం:
తెలుగులో దీనిని ఉత్తరేణి అంటారు. దీని ఆకులు గుండ్రంగా వుంటాయి. గింజలు, ముళ్ళు కలిగి వుంటాయి.
ఉత్తరేణి ఆకుల రసం కడుపునొప్పికి, అజీర్తికి, మొలలకు, ఉడుకు గడ్డలకు, చర్మపు పొంగుకు మంచి మందుగా ఉపయోగపడుతుంది. దీని వేరులతో పళ్లు తోమితే చిగుళ్లు, పళ్లు గట్టిపడతాయి
• ఈ మొక్కని ఆయుర్వేద మందుల తయారీకి వాడుతారు.
• ఉత్తరేణి ఆకుల రసాన్ని గాయాలు తగిలినప్పుడు పూస్తే రక్త స్రావం కాకుండా చూస్తుంది. దురదలు, పొక్కులు, శరీరం పై పొట్టు రాలటం జరుగుతుంటే ఈ రసం శరీరానికి పట్టిస్తే ఆ వ్యాధులు తగ్గుతాయి.
8.తులసీ పత్రం:
హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసీ పత్రాలను దేవతార్చనలో వాడతారు.
• తులసి ఆకులకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ ఆకులు నాడులకు టానిక్‌లాగా, జ్ఞాపకశక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి.
పలురకాల ఆయుర్వేద దగ్గు మందుల్లో తులసిని తప్పకుండా కలుపుతారు. బ్రాంకైటిస్, ఆస్థమాల్లో కఫాన్ని తొలగించటంలో తోడ్పడుతుంది. తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలటం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఎండిన తులసి ఆకులను ధాన్యం నిలవ చేసిన చోట్ల ఉండుతారు – కీటకాలను దూరంగా ఉంచడం కోసం.
రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించడానికీ
‘యాంటీ ఆక్సిడెంట్’ గుణాల వలన బ్లడ్ షుగర్ తగ్గించడానికీ కూడా పనికొచ్చే పదార్ధాలు తులసిలో ఉన్నాయి.
• తులసి ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు తగ్గుతారు.
ప్రతి రోజు రెండుసార్లు 12 తులసి ఆకులను తినడం వలన రక్త శుద్ధి జరుగుతుంది.
• తులసి ఆకులు తినడం వలన నోటి దుర్వాసన తగ్గుతుంది
• తులసి ఆకులు తినడం వలన చెడు శ్వాస తగ్గుతుంది. తులసిని తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి.
9.చూత పత్రం:
చూత పత్రం అంటే మామిడి ఆకు. ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేని హైందవ గృహం పండుగరోజులలో కనిపించదు. మామిడాకులకి ఒక ప్రత్యేకత ఉంది…అవి కోసిన తర్వాత కూడా దాదాపు 48 గంటల వరకు ఆక్సిజెన్ ని వెదచల్లుతూ ఉంటాయి గాలిలోకి.అందుకే పెళ్లిళ్లు లాంటివి జరుగుతున్నప్పుడు మామిడాకు తోరణాలు చాలా ఎక్కువగా కట్టేవాళ్ళు.
పాదాల పగుళ్ళు: మామిడి జిగురుకు మూడురెట్లు నీళ్ళు కలిపి పేస్టులాగా చేసి ప్రతిరోజూ పాదాలకు లేపనం చేసుకోవాలి.
జ్వరం: మామిడి వేర్లను మెత్తగా రుబ్బి అరికాళ్ళకు, అరి చేతులకు రాసుకుంటే జ్వరంలో కనిపించే వేడి తగ్గుతుంది.
చెవి నొప్పి: స్వచ్ఛమైన మామిడి ఆకులనుంచి రసం తీసి కొద్దిగా వేడిచేసి, నొప్పిగా ఉన్న చెవిలో డ్రాప్స్‌గా వేసుకోవాలి.
దంత సంబంధ సమస్యలు: మామిడి ఆకులను ఎండించి బూడిద అయ్యేంతవరకూ
మండించండి. దీనికి ఉప్పుకలిపి టూత్ పౌడర్లా వాడుకోవాలి. ఈ పొడికి ఆవ నూనెను కలిపి వాడుకుంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి.
★కాలిన గాయాలు: మామిడి ఆకుల బూడిదను ‘డస్టింగ్ పౌడర్’లా వాడితే గాయాలు త్వరగా నయమవుతాయి.
పచ్చి మామిడి వడదెబ్బ తగలనీదు. అలాగే పచ్చి మామిడి ముక్కలపై కాస్త ఉప్పు వేసి తినటంవల్ల అధిక దాహాన్ని అరికడుతుంది.
10.కరవీర పత్రం:
దీనినే గన్నేరు అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల పూలుంటాయి. పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది. దీనిలోని విషపుతత్వం ఎక్కువగా జంతువులపైన ప్రభావం చూపిస్తుంది. జంతువులు వాటిని తిన్నప్పుడు ఆ చెట్టులోని విషంవల్ల అవి అక్కడికక్కడే మరణిస్తాయి. వీటిలో ఒలియాండ్రిన్, ఒలియాండ్రిజిన్ అనే రెండు రసాయనాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. అవి కార్డియాక్ గ్లైకోసైడ్స్ గా బాగా ప్రసిద్ధి చెందినవి. అనగా అవి మనిషి శరీరంలోకి వెళ్ళినప్పుడు మరణిస్తాడు. ఈ దూలగుండ చర్మవ్యాదులను, కంటిమంట,దురదలు, చికాకు, అలర్జీ ప్రతిచర్యలకు
కారణం అవుతుంది【ఈ మొక్క పట్ల జాగ్రత్తగా ఉండాలి అని నేర్పిస్తుంది】
11 శంఖపుష్పం
ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు
భూసారాన్ని పెంచడానికి కొన్ని ప్రాంతాలలో వాడుతారు.
శంఖపుష్పాలను వివిధ దేవతలకు జరిపే పుష్పపూజలో ఉపయోగిస్తారు.
దీనిని చాలా శతాబ్దాలుగా ఆయుర్వేదంలో
వివిధ రకాలైన రోగాల చికిత్సలో ఉపయోగిస్తున్నారు.
దీని వేరు విరేచనకారి, మూత్రము సాఫీగా వచ్చుటకు తోడ్పడును.
దీని విత్తనములు నరముల బలహీనతను పోగొట్టుటకు వాడెదరు.
ఆసియాలో దీని పుష్పాలను కొన్ని రకాల ఆహార పదార్ధాల వర్ణకంగా వాడుతున్నారు.
12.దాడిమీ పత్రం:
దాడిమీ అంటె దానిమ్మ ఆకు. శక్తి స్వరూపిణి అంబకు దాడిమీఫల నైవేద్యం ఎంతో ఇష్టం.
అత్యంత శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ల సమాహారం దానిమ్మ.
అల్జీమర్స్, వక్షోజ క్యాన్సర్, చర్మ క్యాన్సర్లను అడ్డుకుంటాయి.
దానిమ్మ సహజ యాస్పిరిన్. రక్తసరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది.
పావు కప్పు రసం రోజూ తాగితే మీ గుండె ఎంచక్కా భద్రంగా బీరువాలో ఉన్నట్టే.
ఈ మధ్య వచ్చిన కరోనా నియంత్రణకి కూడా దానిమ్మ పళ్ల రసం తొక్కతో సహా చేసినది చాలా ఉంపయోగకరం గా ఉన్నది అని నిరూపించబడింది.
13.దేవదారు పత్రం:
దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది.+
ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది.
• దేవదారు పత్రాల చిగుళ్లు మేహశాంతిని కలిగిస్తాయి.
• దీని ఆకులతో కాచిన తైలం కళ్లకు చలువజేస్తుంది.
• ఈ చెట్టు ఆకులు, పువ్వులు కూడా మంచి ఔషధులే.
14.మరువక పత్రం:
దీనిని మరువం అని కూడా అంటారు. దీన్ని వాడుక భాషలో ధవనం, మరువం అంటారు. ఆకులు ఎండినా మంచి సువాసన వెదజల్లుతుండటం ఈ
పత్రం ప్రత్యేకత.
పత్రి యొక్క ఔషధ గుణాలు :
• కీళ్ళనొప్పులను తగ్గిస్తుంది
• చర్మవ్యాధులను తగ్గిస్తుంది
• హృదయ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
15.సింధువార పత్రాన్నే వాడుకలో వావిలి అని కూడ పిలుస్తుంటారు
• వావిలి ఆకులు వాత సంబంధమైన నొప్పులకు, శరీరముపైన వాపులను తగ్గించుటకు వాడతారు.
• దీని పువ్వులను కలరావ్యాధిని, జ్వరమును, కాలేయపు, గుండె జబ్బులను నివారించుటకు వాడతారు.
పత్రాలతో గుంట గలగర ఆకు, తులసి, వాము, కలిపి దంచి రసం తీసి ఇస్తే కీళ్ల నొప్పులు ముఖ్యముగా ర్యుమటాయిడ్ ఆర్ధ్రయిటిస్ కు బాగా ఉపశమనం కలుగుతుంది.
• వావిలి చెట్టు కొమ్మలను కొడవలి పిడులకు విశేషంగా ఉపయోగిస్తారు.
16.జాజి పత్రం:
ఇది సన్నజాజి అనే మల్లిజాతి మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు.
17.గండలీ పత్రం:
దీనినే లతాదూర్వా అనికూడా అంటారు. భూమిపైన తీగమాదిరి పాకి కణుపులలో గడ్డిమాదిరి పెరుగుతుంది.+
దీనిని జ్వరం,దాహం,మంట తగ్గడానికి వాడతారు.
18.శమీ పత్రం:
జమ్మిచెట్టు ఆకులనే శమీ పత్రం అంటారు. దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
కుష్టు రోగ నివారణకు, అవాంఛిత రోమాల నివారణకు జమ్మి యొక్క ఆకులను ఉపయోగిస్తారు.అతిసార వ్యాధి తగ్గుతుంది. అందుకే ఈ చెట్టును సురభి బంగారం అనే పేరు వచ్చింది.
19).అశ్వత్థ పత్రం:
రావి ఆకులనే అశ్వత్థ పత్ర మంటారు. రావి చెట్టుకు పూజలు చేయటం మనసంప్రదాయం. అశ్వత్ద వృక్షం త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతిరూపంగా హిందువులు పరిగణిస్తారు, పూజిస్తారు. దసరా రోజు దీని వద్ద జ్వలా తోరణం కాలుస్తారు.+
దీని పత్రాలను పూజలకు వాడుతారు. కొందరు ఇంటి ముందు దిష్టిగా కట్టుకొంటారు.
20).అర్జున పత్రం:
మద్దిచెట్టు ఆకులనే అర్జున పత్రమంటారు. ఇవి మర్రి ఆకుల్ని పోలి వుంటాయి. అడవులలో పెరిగే పెద్ద వృక్షం.
బెరడు నూరి ఆ మూలకమును వ్రణమున్న చోట కడితే ఎలాంటి వ్రణములెైనా తగ్గిపోతాయి.
దీని బెరడుపను అధిక రక్తపోటు, గుండె నొప్పి,రక్తంలో కొలెస్ట్రాల్ కి మందుగా వాడతారు.
21.అర్క పత్రం:
జిల్లేడు ఆకులను అర్క పత్రమంటారు. తెల్లజిల్లేడు వేరుతో తయారుచేసిన వినాయకప్రతిమను పూజించడం వల్ల విశేషఫలం వుంటుందంటారు.(శ్వేతార్క గణపతి)
• చర్మ సమస్యలను తగ్గిస్తుంది.
• కీళ్ళ సమస్యలను తగ్గిస్తుంది.