భారీ బడ్జెట్లలో, పేరున్న దర్శకులతో సినిమాలు చేశాడు కానీ.. తెలుగులోనే ఇంకా ఒక ఇమేజ్, సరైన సక్సెస్ అందుకోలేదు బెల్లంకొండ శ్రీనివాస్. అలాంటిది డైరెక్ట్ హిందీ సినిమా (ఛత్రపతి రీమేక్) చేయాలని కొన్నేళ్ల ముందు సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు.
ఇంటర్నెట్ విప్లవం పుణ్యమా అని తెలుగు డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్, హిందీ ఛానెళ్లలో మంచి స్పందన తెచ్చుకోవడం.. శ్రీనివాస్‌కు ఉత్తరాదిన మాస్ జనాల్లో కొంత ఫాలోయిం్గ రావడం చూసి ఈ రిస్క్‌కు రెడీ అయ్యాడు. హిందీలో పెద్ద నిర్మాతల్లో ఒకరైన జయంతిలాల్ గద ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు రావడం విశేషం.
ఐతే ఏదైనా డైరెక్ట్ స్టోరీతో సినిమా ట్రై చేస్తే బాగుండేదేమో కానీ.. ఎప్పుడో దశాబ్దంన్నర కిందట రిలీజైన పాత చిత్రం ‘ఛత్రపతి’ని రీమేక్ చేయాలనుకోవడం.. ఏమాత్రం ఫాంలో లేని వి.వి.వినాయక్‌ను దర్శకుడిగా ఎంచుకోవడమే విడ్డూరం.
హిందీ ‘ఛత్రపతి’ మొదలై రెండేళ్లు దాటిపోయింది. కానీ ఆ సినిమా షూటింగ్ అప్డేట్లు ఏవీ బయటికి రాలేదు. అసలు సినిమా లైన్లోనే ఉందా ఆగిపోయిందా అనే సందేహాలు కూడా కలిగాయి. ఐతే చాలా కాలం తర్వాత ఎట్టకేలకు సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. అది రిలీజ్ అప్డేట్ కావడం విశేషం. సమ్మర్లో మంచి డేటునే ఎంచుకుంది చిత్ర బృందం. మే 5న హిందీ ‘ఛత్రపతి’ రిలీజ్ కాబోతోంది.
ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తోందని సమాచారం. వినాయక్ దాదాపుగా తన పని పూర్తి చేసి.. బాలీవుడ్ లోకల్ టీంకు మిగతా పని అప్పగించి హైదరాబాద్ వచ్చేసినట్లు తెలుస్తోంది. రిలీజ్ ముంగిట మళ్లీ అక్కడికి వెళ్తాడట. ప్రస్తుతం ఆయన తెలుగులో తన తర్వాతి సినిమా ప్రయత్నాల్లో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆయనకు మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ కూడా తన తర్వాతి తెలుగు సినిమా దిశగా అడుగులు వేస్తున్నాడు.
#Chatrapathi, the Hindi remake of the Telugu blockbuster of the same name, was launched today. Stars Bellamkonda Sai Srinivas, directed by VV Vinayak. pic.twitter.com/kpsrGnKsUA
— Jalapathy Gudelli (@JalapathyG) July 16, 2021