గాన గంధర్వుడు.. పాటల పూదోట.. దివంగత శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం(ఎస్పీ బాలు) ప్రథమ వర్దంతిని పురస్కరించుకుని.. సెప్టెంబరు 25న బే ఏరియా తెలుగు అసోసియేషన్(బాటా) ఘన నివాళులు అర్పించింది. తెలుగు నేలపై జన్మించి.. యావత్ భారత దేశం సగర్వగా చెప్పుకొనే స్థాయికి తన గళాన్ని వినిపించిన పాటల, మాటల మాంత్రికుడు.. ఎస్పీ బాలు.. గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్‌లో.. వైరస్ బారిన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ. సెప్టెంబరు 25న అమరలోకాలకు వెళ్లిపోయారు. సుమారు.. 55 ఏళ్ల సుదీర్ఘ సినీ పాటల ప్రస్థానం ఆయన సొంతం. అంతేకాదు.. ఇప్పటి వరకు ఎవరూ పాడని విధంగా 40 వేల పైచిలుకు పాటలు పాటి.. ప్రత్యేక రికార్డును సొంతం చేసుకున్నారు.
బాటాకు.. ఎస్పీ బాలుకు మధ్య కూడా అవినాభావ సంబంధం ఉంది. గడిచిన 25 సంవత్సరాలుగా.. ఆయన బాటా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బాటాతో కలిసి.. బే ఏరియాలో సుమారు 15 కచేరీలు కూడా చేశారు. తానా మాజీ అధ్యక్షులు, స్థానిక నేత.. జయరాం కోమటి మాట్లాడుతూ.. ఎస్పీ బాలుతో తనకు ఉన్న ఉన్న పరిచయం చాలా ప్రగాఢమైందని పేర్కొన్నారు. ఆయనను కోల్పోవడం తనను ఎంతో బాధించిందని పేర్కొన్నారు.
బాటా సలహాదారు.. ప్రసాద్ మంగిన.. మాట్లాడుతూ.. బాలు గారు మనమధ్య లేరనే విషయం.. ఇప్పటికీ నమ్మశక్యంగా లేదన్నారు. ఆయన ఈ లోకాన్ని వీడి అప్పుడే సంవత్సరం పూర్తయిపోయిందని.. సంగీత ప్రమేమికులను వదిలేసి.. ఆయన స్వర్గానికి చేరుకున్నారని.. అన్నారు. బాటా ఉపాధ్యక్షులు.. కొండల్ రావ్, సాంస్కృతిక సలహాదారు శ్రీదేవి పసుపులేటి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు శివ కాడా.. ఈ కార్యక్రమంలో పాల్గొని ఎస్పీ బాలు జ్ఞాపకాలను మననం చేసుకున్నారు.
ఎస్పీ బాలుతో తమకు ఉన్న వ్యక్తిగత అనుభవాలను ఈ సందర్భంగా వక్తలు గుర్తు చేసుకున్నారు. బాలు ఎవర్ గ్రీన్‌గా ఎందుకు నిలిచిపోయారో.. వారు మననం చేసుకున్నారు. బాలు అర్ధంతరంగా.. పాటల లోకాన్ని.. అభిమానులను వీడిపోవడం.. తీరని లోటని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగు వారికి బాలు లేని లోటు.. పూడ్చలేనిదన్నారు. 1950ల నుంచి 2000 మధ్య ఉన్న సినీ రంగానికి ఆయన వారధి వంటి వారని కొనియాడారు.
బాటా ఎగ్జిక్యూటివ్ బృందం: హరినాథ్ చికోటి(అధ్యక్షులు), కొండల్ రావ్(ఉపాధ్యక్షులు), అరుణ్(కార్యదర్శి), శివ కాడా, వరుణ్ ముక్కా.
నిర్వహణ కమిటీ: రవి, కామేష్, శిరీష, యశ్వంత్, సుమంత్
సలహా బోర్డు: జయరాం కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పాల, ప్రసాద్ మంగిన, రమేష్ కొండా, కరుణ్ వెలిగేటి, కళ్యాణ్ కట్టమూరి.
సాంస్కృతిక కమిటీ: శ్రీదేవి, శ్రీలు, దీప్తి
నామినేటెడ్ కమిటీ: హరి సన్నిధి, సురేష్ శివపురం, శరత్ పోలవరపు
యువజన విభాగం: సంకేత్, సందీప్, ఆది, క్రాంతి, ఉదయ్, హరీష్
వీరంతా కూడా ఎస్పీ బాలుతో ఉన్నతమ పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. బాటా సభ్యులు అందరితోనూ.. బాలు.,. ఎంతో ప్రేమ, గౌరవాలతో సంభాషించేవారని మననం చేసుకున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవంగా పిలిచేవారని గుర్తు చేసుకున్నారు.
బాటా సలహాదారు.. ప్రసాద్ మంగిన కార్యక్రమాన్ని నిర్వహించారు. గాయకులను ఆహ్వానించారు. ఎస్పీ బాలుకు నివాళిగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన గీతాలను మృధుమథురంగా ఆలపించారు.
గాయకులు వీరే: రవి గుడిపాటి, శ్రీ క్రిష్ణన్, శేష ప్రసాద్, రాజా గోవర్ధన్, శ్రీధర్ ఘనాపాటి, సచిన్ శ్రీవాస్తవ, కృష్ణ రాయసం, తినాథ్ రావు, సుచిత్ర దేవులపల్లి, మానస గాడేపల్లి, విజయ గోపరాజు, క్రితిక బూరెడ్డి, శోహిని చక్రవర్తి, మురళి గండ్లూరు, ప్రకాశ్ కోట్ల, నవ్య వేమూరి, మాల తంగిరాల, కిశోర్ నిట్టల, నవీన్ పొటొల్ల, బాలాజీ తమిరస, శరణ్య, మురళి కృష్ణ పి. రామకృష్ణ వీ. ప్రసాద్ బీ. శ్రీనివాస్ తగిరిస, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఘంటసాల, ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్నార్. సావిత్రి, మహమ్మద్ రఫి, కిశోర్ కుమార్ వంటివారు చరిత్రలో ఎన్ని దశాబ్దాలు గడిచినా.. నిలిచిపోతారని వక్తలు తెలిపారు. వీరి సరసనే ఎస్పీ బాలు చేరుకున్నారని.. పేర్కొన్నారు.