సినిమా సమస్యలపై పవన్ కళ్యాణ్ మాట్లాడితే… భయమున్నోడు సైలెంట్ గా ఉన్నాడు. తెలుగు సినిమా పరిశ్రమలో అందరికీ భయమే కాబట్టి … చివరకు చిరంజీవి కూడా పవన్ కి మద్దతు పలకలేదు. మైగా ఫ్యామిలీలో అనైక్యతే ఆ కుటుంబం బలహీనత.
అయితే, తనకు ఏ సంబంధం లేకుండా ఒక వైసీపీ కార్యకర్తలా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పై పోసాని విమర్శలు చేశాడు. దీంతో సినిమా గురించి మాట్లాడితే పవన్ ని తిడతావా అంటూ పవన్ అభిమానులు పోసానిపై పడ్డారు. ఇగ్నోర్ చేస్తే సరిపోయేదానికి పోసాని మళ్లీ సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టాడు.
పవన్ ని బండ బూతులు తిట్టాడు. సాధారణ మనుషులు మాట్లాడటానికి శంకించే బూతులు కూడా మీడియా ఎదుట మాట్లాడితే పవన్ ని తిట్టాడు పోసాని కృష్ణమురళి. ఇదంతా చూస్తుంటే పవన్ ఉద్యమాన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ ఎత్తుగడలో భాగమే అని అభిమానులు ఆరోపిస్తున్నారు.
ఇక పోసాని బూతులు తిడుతుంటే తట్టుకోలేని అభిమానులు సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ వద్దకు వచ్చి ఆందోళన చేశారు. పోసాని ప్రెస్ మీట్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరి పోలీసులకు అతను బూతులు మాట్లాడతాడు అని ఎలా తెలిసిందో ముందే అక్కడ చాలామంది పోలీసులు మొహరించి ఉన్నారు.
జనసేన కార్యకర్తలను వారు అడ్డుకుని పోసానిని రక్షించారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ నేను చనిపోతే దానికి కారణం పవన్ కళ్యాణే. రేపు అతనిపై కేసు పెడతాను అంటూ వ్యాఖ్యానించాడు.
నాకు ఏమైనా అయితే దానికి కారణం పవన్ కల్యాణే🙏🥲
:- posani#PosaniKrishnaMurali pic.twitter.com/0mRjdHfIeJ— చిన్న రామయ్య ⒻⒶⓃ ❼ (@likith_09) September 28, 2021