• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

పర్మిషన్ కూడా లేకుండా గోవాలో బార్ ఓపెన్ చేసేసింది

NA bureau by NA bureau
July 24, 2022
in Around The World, Politics, Trending
1
0
SHARES
259
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి.. కేంద్రమంత్రి వర్గంలో అంత మంది ఉన్నప్పటికీ.. పట్టుమని పది పేర్లు కూడా చెప్పలేని రీతిలో కేబినెట్ ను సెట్ చేయటంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కసరత్తును అభినందించాల్సిందే. పేరుకు కేంద్ర మంత్రులే తప్పించి.. గతంలో మాదిరి దేశ వ్యాప్తంగా ఫేమ్.. పలుకుబడి..లాంటివి పెద్దగా ఉండని పరిస్థితి. అంతా మోడీ మయం అన్నట్లుగా.. ఆయన నామ స్మరణే నిత్యం సాగుతూ ఉంటుంది.

అలాంటి మోడీ మంత్రి వర్గంలో దేశ ప్రజలందరికి సుపరిచితమైన పేర్లు వేళ్ల మీద లెక్క బెట్టేంత మందే ఉంటారు. వారిలో ఒకరు కేంద్ర మంత్రి  స్మృతి ఇరానీ. మోడీ 1.0 సర్కారులో  స్మృతికి లభించిన స్థాయి.. స్థానంతో పోలిస్తే.. మోడీ2.0లో దక్కుతున్న ప్రాధాన్యత తక్కువనే చెప్పాలి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆమెకున్న ఇమేజ్ కు పూర్తి భిన్నమైన ఆరోపణను ఆమె ఎదుర్కొంటుననారు. గోవాలో నిబంధనలకు విరుద్ధంగా బార్ నడుపుతున్నారంటూ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేయటం షాకింగ్ గా మారింది. చనిపోయిన వ్యక్తి పేరుతో బార్ లైసెన్సును తీసుకొని అక్రమంగా నడుపుతున్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా వెల్లడించారు. ఆయన వినిపిస్తున్న వాదనను చూస్తే.. 2021లో చనిపోయిన ఒక వ్యక్తి పేరు మీద 2022లో లైసెన్సు తీసుకున్నారని చెబుతున్నారు.

పదమూడు నెలల క్రితం చనిపోయిన వ్యక్తి పేరు మీద బార్ లైసెన్సు ఎలా తీసుకుంటారు? అని ప్రశ్నిస్తూ.. ఇది ముమ్మాటికీ అక్రమమేనని వ్యాఖ్యానించారు. గోవాలో అమలవుతున్న నిబంధనల ప్రకారం ఒక రెస్టారెంట్ కు ఒక బార్ లైసెన్స్ మాత్రమే ఉండాలి. అయితే.. ‘‘సిల్లీ సోల్స్ గోవా రెస్టారెంట్’ పేరుతో మాత్రం రెండు బార్ లైసెన్సులు ఉన్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ బార్ మరెవరిదో కాదని.. కేంద్రమంత్రి  స్మృతి కుమార్తెదని ఆయన ఆరోపిస్తున్నారు.

కేంద్ర మంత్రి  ప్రమోయం లేకుండా ఆమె కుమార్తె లైసెన్సు పొందగలరా? అని ప్రశ్నిస్తున్నారు.
ఈ ఆరోపణ మీద  స్మృతి రియాక్టు అయ్యారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదంటున్నారు. తన కుమార్తె వయసు కేవలం పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమేనని.. కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతుందని.. అలాంటిది ఆమె పేరు మీద బార్ లైసెన్సు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు.

సిల్లీ సోల్స్ గోవా రెస్టారెంట్ లో తమ క్లయింట్ కు ఎలాంటి సంబంధం లేదని  స్మృతి కుమార్తె జోయిస్ ఇరానీ తరఫు న్యాయవాది స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు.. ఆమె యజమాని కూడా కాదంటున్నారు. ఇదంతా చూస్తే.. మనిషిని పోలిన మనిషి ఉన్నట్లు పేరును పోలిన పేర్లు చాలామందికి ఉండి ఉంటాయి కదా? అలాంటి కన్ఫ్యూజన్ లో కాంగ్రెస్ నేత ఆరోపించారా? లేదంటే మరేదైనా బలమైన సోర్సు ఉందా? అన్నది ఆయన ఇచ్చే తదుపరి సమాధానం మీద ఉందని చెప్పాలి.

Pork Dish served by Smriti Irani's daughter
Newly opened liquor shop and bar at Goa.#SmritiIrani pic.twitter.com/QFjucWksbC

— चाय वाला🇮🇳 (@Andhbhaktdilse) July 24, 2022

Smriti Irani falsely claimed that her 18 year daughter has no relation with 'Silly Soul Cafe and Bar. @smritiirani

In this video you can clearly see her daughter accepting the fact that she is the owner of that Controversial bar which is functioning with illegal bar License. pic.twitter.com/URqPAkRZve

— Nitin Agarwal (@nitinagarwalINC) July 23, 2022

Tags: BJPGoaModismriti irani
Previous Post

కేటీఆర్ కి పంచ్ లు పడ్డాయి

Next Post

అమ్మ ఒడి ఇచ్చినా జగన్ ను భయపెట్టిన అమ్మలు

Related Posts

Movies

Mahesh birthday : పిల్లలకు ప్రాణం పోస్తున్న శ్రీ‌మంతుడు

August 9, 2022
Andhra

ఢిల్లీ లో వెంక‌య్య త‌రువాత ఎవ‌రు ?

August 9, 2022
Trending

రోజాకు జనసేన నేతల వార్నింగ్

August 8, 2022
Trending

పవన్ కు మంత్రి ధర్మాన ఛాలెంజ్

August 8, 2022
Trending

బాబు పాలకుడు…జగన్ పాలెగాడు..వైరల్

August 8, 2022
Trending

కుల చిచ్చు రేపిన గోరంట్ల కామెంట్స్

August 8, 2022
Load More
Next Post

అమ్మ ఒడి ఇచ్చినా జగన్ ను భయపెట్టిన అమ్మలు

Comments 1

  1. Pingback: పర్మిషన్ కూడా లేకుండా గోవాలో బార్ ఓపెన్ చేసేసింది - TodayNewsHub

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • Mahesh birthday : పిల్లలకు ప్రాణం పోస్తున్న శ్రీ‌మంతుడు
  • ఢిల్లీ లో వెంక‌య్య త‌రువాత ఎవ‌రు ?
  • రోజాకు జనసేన నేతల వార్నింగ్
  • పవన్ కు మంత్రి ధర్మాన ఛాలెంజ్
  • బాబు పాలకుడు…జగన్ పాలెగాడు..వైరల్
  • సెక్స్ లైఫ్ పై తాప్సీ షాకింగ్ కామెంట్స్
  • మోడీ ఇలాకాలో ‘రౌడీ’ కి ఇంత క్రేజా?
  • కుల చిచ్చు రేపిన గోరంట్ల కామెంట్స్
  • అమరావతిపై సుప్రీం కోర్టు తలుపుతట్టిన రైతులు
  • 2034 వరకు జగనే సీఎం? బాబుకు నో చాన్స్?
  • `బాటా` స్వ‌ర్ణోత్సవ వేడుక‌ల `కిక్ ఆఫ్ -గెట్ టుగెద‌ర్‌’ విజ‌య‌వంతం!
  • బాలినేనిని గిల్లిన పవన్ కల్యాణ్.. ఏంటి సంగతీ?
  • Allu Arjun: కళ్యాణ్ రామ్ అంటే నాకు ఎంతో గౌరవం
  • Samantha: ఆ విష‌యంలో ర‌ష్మిక ముందు స‌మంత కూడా దిగ‌దుడుపే!
  • కేసీఆర్ కి పంచ్ పడింది !

Most Read

ఏకాంత భేటీలో చంద్రబాబుతో మోదీ ఏం చెప్పారు?

గోరంట్ల వీడియో లీక్ వెనుక వైసీపీ నేతలు?

‘బింబిసార’ ఫస్ట్ రివ్యూ..మంట పుట్టిందట

జగన్ కు ‘షాక్’ ఇచ్చేలా విద్యుత్ ఉద్యోగి స్పీచ్..వైరల్

బాబు పాలకుడు…జగన్ పాలెగాడు..వైరల్

అంబటికి చుక్కలు చూపించారుగా!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra