మరో 4 రోజుల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం గడువు ముగుస్తున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నంద్యాల జిల్లా బనగానపల్లెలో టిడిపి అభ్యర్థి బీసీ జనార్ధన్ రెడ్డి భార్య ఇందిరపై వైసీపీ నేతలు దాడి చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఇందిరపై బనగానపల్లి వైసిపి అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తనయుడు ఓబుల్ రెడ్డి దాడికి ప్రేరేపించారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.
కావాలనే టిడిపి శ్రేణులను వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టాయని, ఈ క్రమంలోనే ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బనగానపల్లెలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడడంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. ఇరవై గలను చెదరగొట్టి పోలీసులు అక్కడ పరిస్థితిని చక్కదిద్దారు.
మరోవైపు, అల్లూరి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ టిడిపి అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. అల్లూరి స్ఫూర్తిగా సామాన్యులపై అణచివేతను ఎదిరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గిరిజనుల పట్ల బ్రిటిష్ వారు చేసిన అన్యాయాలను ఎదిరించి గిరిజనుల కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. అల్లూరి స్ఫూర్తితో ఈ ఎన్నికల పోరాటంలో ప్రజలను గెలిపించి రాష్ట్రాన్ని నిలబెట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సామాన్యులపై జరిగే ప్రతి అమానుష ఘటనను ఎదిరించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు.
బనగానపల్లెలో కూరగాయల మార్కెట్ సమీపంలో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్ధన్ రెడ్డి సతీమణి ఇందిరమ్మ ప్రచారం చేస్తూ ఉండగా, కాటసాని రామిరెడ్డి కొడుకు ఓబుల్ రెడ్డి దగ్గరుండి దాడి చేపించాడు. రాళ్లు, కర్రలతో తల్లి వయసున్న మహిళలపై పాశవికంగా దాడి చేసారు. మే 13న జగన్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి… pic.twitter.com/sZSThpBaWe
— Telugu Desam Party (@JaiTDP) May 7, 2024