అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో ఆహా ఓటీటీకి కొత్త ఊపును ఇచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటివరకు టెలికాస్ట్ అయిన ప్రతి ఎపిసోడ్ కు అనూహ్య స్పందన వచ్చింది. బాలయ్య తనదైన డైలాగులతో హావభాావాలతో ఈ షోను మరో లెవల్ కు తీసుకువెళ్లారు. మొదటి సీజన్ 10 ఎపిసోడ్స్ తో గ్రాండ్ గా ముగిసింది. మొదటి సీజన్ లో మంచు ఫ్యామిలీ, పుష్ప టీం, రవితేజ, అఖండ టీం, బ్రహ్మానందం, రాజమౌళి, మహేష్ బాబు.. ఇలా పలువురు సెలబ్రిటీలు వచ్చి అలరించారు. బాలయ్య బాబులోని మరో కోణాన్ని చూపించిన ప్రోగ్రాం అన్ స్టాపబుల్ ఇపుడు రెండో సీజన్ తో అదరగొట్టేందుకు రెడీ అవుతోంది.
ఈ షో రెండో సీజన్ ఉంటుందని గతంలోనే ఆహా ప్రకటించిన సంగతి తెలిసిందే. స్వయంగా బాలయ్యే ఈ షోకు కొనసాగింపు ఉంటుందని అనౌన్స్ చేశారు. ఇప్పటికే సెట్ వర్క్ ప్రారంభం అయ్యిందని,. త్వరలోనే మొదటి ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ లో బాలయ్య పాల్గొంటారని తెలుస్తోంది. గోపీచంద్ మలినేని మూవీ ఎన్ బీ కే 107 సినిమా కోసం టర్కీ వెళ్ళిన బాలయ్య త్వరలోనే ఇండియాకు తిరిగి వచ్చి అన్ స్టాపబుల్ షో లో పాల్గొంటారని తెలుస్తోంది. ఆగస్టు 8 నుంచి ఆహా ఓటీటీలో ఈ షో సెకండ్ సీజన్ తొలి ఎపిసోడ్ మొదలుకాబోతోందట. అయితే, దీని గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.
అసలు బాలకృష్ణ యాంకర్ గా చేయడం ఏంటి? అనుకున్న వాళ్లంతా ఈ షో చూసిన తర్వాత నోరెళ్లబెట్టారు. ఈ షోలో బాలయ్య బాబు ఫుల్ ఎనర్జీతో ఇచ్చిన ఎంటర్టైన్మెంట్…చేసిన హడావిడి…వచ్చిన గెస్టులతో సరదాగా కబుర్లు చెప్పిన వైనం…ప్రేక్షకులను కట్టిపడేసింది. అందుకే, ఈ షో సీజన్ 2 కోసం ప్రేక్షకులతోపాటు బాలయ్య ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఈ షోలో ఇప్పటిదాకా టెలికాస్ట్ అయిన ప్రతి ఎపిసోడ్ టాప్ రేటింగ్ నమోదు చేసింది. ఈ షో దేశంలోనే నంబర్ వన్ టాక్ షోగా నిలిచిందని ఐఎండీబీ ప్రకటించింది. ఇండియాలోని టాక్ షోలపై ఐఎండీబీ చేసిన సర్వేలో 9.7 పాయింట్లతో బాలయ్య షో అగ్ర స్థానంలో నిలిచింది. దేశంలోని అన్ని టీవీ షోలు, వెబ్ షోలలో టాప్ 50 షోలను ఐఎండీబీ సెలెక్ట్ చేసింది. వాటిలో బాలయ్య షో 100కి 9.7 పాయింట్లతో టాప్ లేపింది.