హోదా ఉన్నంత మాత్రాన మనం మనుషులు కాకుండా పోము. మొన్న వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి అయినా కూడా స్వామి ముందు కేవలం నేను ఒక ప్రాణియే కదా అని సాధారణ దర్శనం చేసుకున్నారు.
అది మన గురించి మనం తెలుసుకోవడం మాత్రమే నిరాడంబరత కూడా కాదు. అదే నిజం.
భారీ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీల్లో ఒకరైన బాలకృష్ణ కుటుంబంతో కలిసి నిన్న హిందుపురంలో ఓటు వేయడానికి వచ్చారు. సాధారణ ఓటరులా క్యూలో నిలబడి ఓటు వేశారు. ఆయన అక్కడి ఎమ్మెల్యే. అక్కడి ఓటరు. ఇలాంటి విజ్జత ప్రతి రాజకీయ నాయకుడికి ఉంటే బాగుంటుంది.