బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి, అనుష్క నటించిన రుద్రమ దేవి సినిమాలు వివాదాస్పద రీతిలో తాజాగా వార్తలకెక్కాయి.
ఈ రెండూ హిస్టారికల్ మూవీస్. విజయవంతం కావడంతో మంచి బిజినెస్ చేశాయి. అయితే, విడుదల సమయంలో, రెండు చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వాల నుండి భారీ రాయితీలు వచ్చాయి.
నిర్మాతల వినతి మేరకు తెలంగాణ ఆంధ్రా రాష్ట్రాల ప్రభుత్వాలు రెండు సినిమాలకు రాయితీలు ఇచ్చాయి. అయితే నిర్మాతలు ఆ రాయితీలను ప్రజలకు అందజేయాలి. కానీ వారు ఆ పనిచేయలేదు.
దీంతో మూవీ వ్యూయర్స్ అసోసియేషన్ ఈ సినిమాలపై న్యాయస్థానం వద్దకు వెళ్లింది. విచారణ అనంతరం కోర్టు నిర్మాతలకు సమన్లు జారీ చేసింది.
భారీగా రాయితీలు పొందినా అది వీక్షకులకు ఎందుకు అందించలేదో చెప్పాలని నోటీసులు జారీ చేసింది.
గౌతమీపుత్ర శాతకర్ణికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల నుండి రాయితీలు లభించగా, రుద్రమ దేవికి తెలంగాణ ప్రభుత్వం రాయితీ ఇచ్చింది. వారు ఈ కారణంగా మంచి లాభాలు సంపాదించారు.
మళ్లీ ఇన్నాళ్లకు ఇప్పుడు గౌతమీపుత్ర శాతకర్ణి తీసిన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్కి, రుద్రమదేవిని తీసిన గుణ టీమ్ వర్క్స్‌కి కోర్టు నోటీసులు జారీ చేసింది. మరి వారు ఏం సమాధానం చెబుతారో మరి.