మూడు సంవత్సరాలలొ అయిదు లక్షల కోట్ల రుణాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిబంధనలకు విరుద్దంగా అప్పు చేసింది జగన్ ప్రభుత్వం. ఇంత డబ్బు ఏమిచేస్తున్నారో, ఎక్కడ ఖర్చు పెడుతున్నారొ అడిగేవాడు లేడు. ఇది నిజంగా అవసరానికి చేసే అప్పేనా? అయితే ఏమిటా అవసరం? రేపు ఈ అప్పులు తీర్చేది ఎవరు? పరోక్షంగా ప్రజలు కదా? వారికి సమాధానం చెప్పాల్సిన పనిలేదా?
ఇదిలావుంటే అసలు ఈ అప్పులు చేయించడం వెనుక భైరాగుల కుట్ర ఉందా అంటే అవును అనే సమధానమే వస్తుంది వీళ్ళ ఆలోచనా విధానం తెలిసిన వారెవరికైనా, ఈ భైరగులు చేసే ఏ దిక్కుమాలిన ఆలొచన కైనా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఉంటుంది. గత వంద సంవత్సరాలుగా ఇది చూస్తూనే వున్నాం.
హింది అధారిత అఖండ భారత్ అనే అలొచన, దానికి ఉత్తరాది బ్రాహ్మణ ఆదిపత్యం వుండాలనే లక్ష్యంకి ప్రధానంగా దక్షిణాది నుంచి వ్యతిరేకత వచ్చేది ప్రధానంగా తమిళ తెలుగు తంబిల నుంచే. గతంలొ హిందికి వ్యతిరేకంగా తమిళులు కేంద్రంపై చేసిన పోరాటం కానీ, తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదం తో డిల్లిని తెలుగువాడు గడగడలాడించటం వాళ్ళకి మింగుడుపడని విషయాలు. రాజకీయంగా బలంగా వున్న తెలుగువారిని బలహీన పరచాలనే లక్ష్యంతో ఆరొజు రాష్ట్రాన్ని విడగొట్టే దిశగా కాకినాడ తీర్మానం చెయ్యటం, రాష్ట్రాన్ని విడగొట్టటం జరిగింది. విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయకత్వంలో తిరిగి బలపడాలని, అమరావతి రాజధానిగా తెలుగుజాతి పూర్వవైభవాన్ని గుర్తింపుని పొందాలన్న సంకల్పంతో క్రుషి చేస్తుండటం భైరాగులు తమ లక్ష్యసాధనకు అడ్డంకిగా మారొచ్చని ఆలొచనలొ పడ్డారు.
ఈ దిశగా పావులు కదిపి కేసుల్లో ఇరుక్కున్న జగన్ ని దగ్గరకుతీసి కులాల కుంపట్లు రగిల్చి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి తమ గుప్పెట్లోకి తెచ్చుకొన్నారు. వరదల్లో నిండా మునిగినా ఆదుకోమని కనీసం అడగలేని స్తితిలోకి రాష్ట్రాన్ని నెట్టారు. పొర్టులుని, స్టీలు ప్లాంటులని అయినవాళ్ళకు రాసుకున్నా నొరెత్తలేని స్తితి.
ఇక రాష్ట్ర ఆర్ధికమూలాల్ని దెబ్బతీసి అంతులేని అప్పుల్లొముంచి ఎల్లకాలం డిల్లి దయా దాక్షిన్యాలమీద అధారపడెటట్లు చేసి జాతి ఆత్మగౌర్వన్ని సమూలంగా దెబ్బతీస్తున్నారు. నిండా అప్పుల్లో ఎల్లకాలం మునిగిని వాడికేమి ఆత్మగౌరవం వుంటుంది.
ఇప్పటికయినా జాగ్రుతులై ఆంధ్రాకు జరుగుతున్న దారుణాలని గుర్తించి కలసి మెలసి పోరాడకపోతే మన భావితరాల భవిష్యత్తుని జాతి అస్తిత్వాన్ని సమూలంగా నాశనం చేసిన వాళ్ళుగా చరిత్రలొ మిగిలిపోవడం ఖాయం.
సాయి నూతక్కి !!