• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

షర్మిల దెబ్బకు దిగొచ్చిన కేటీఆర్

NA bureau by NA bureau
July 26, 2022
in Politics, Telangana, Top Stories, Trending
1
0
SHARES
148
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తన కాలికి దెబ్బ తగిలిందని, మూడు వారాల బెడ్ రెస్ట్ లో చూసేందుకు ఓటీటీ కంటెంట్ ను సూచించాలంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ రాజకీయ దుమారం రేపింది. జనం వరదలు, వర్షాలతో అతలాకుతలమవుతుంటే కేటీఆర్ సినిమాలు చూస్తున్నారంటూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల సెటైర్లు వేశారు. కుట్ర సిద్ధాంతం:క్లౌడ్ బరస్ట్, నీటమునిగిన ఇళ్ళు, మరియు పంప్ హౌస్ లు అంటూ వెటకారమాడారు. దీంతో, షర్మిలపై కేటీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుబెట్టారు.

సెటైరికల్ గా సినిమాల పేర్లు సూచించిన తనపై కేటీఆర్ అభిమానులు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని, ఒక మహిళ, పిల్లల తల్లి అయిన తనపై ఇటువంటి విమర్శలు చేయడానికి సిగ్గు లేదా అని షర్మిల మండిపడ్డారు. ఈ నేపథ్యంలో షర్మిల చేసిన కామెంట్లకు కేటీఆర్ దిగొచ్చారు. ప్రతిపక్ష నేతల కుటుంబం, పిల్లలు, వారి వ్యక్తిగత విషయాలపై విమర్శలు చేయవద్దని టీఆర్ఎస్ శ్రేణులు, తన అభిమానులకు కేటీఆర్ సూచించారు.

రాజ‌కీయ విమ‌ర్శ‌ల నుంచి నేత‌ల పిల్ల‌ల‌ను మిన‌హాయిద్దాని కేటీఆర్ పిలుపునిచ్చారు. పిల్ల‌ల‌ను అడ్డుపెట్టుకొని నేత‌ల‌ను టార్గెట్ చేయ‌డం ఎంత‌మాత్రం ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం కాద‌ని కేటీఆర్ అన్నారు. ఈ రాజ‌కీయ రొంపిలోకి నేతల పిల్లలను లాగే దుష్ట సంస్కృతికి చ‌ర‌మ గీతం పాడ‌దామంటూ త‌న సొంత పార్టీ నేత‌ల‌కు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ నేత‌లు, పార్టీ సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌లు ఈ తరహా సంస్కృతికి స్వ‌స్తి చెప్పాల‌ని కోరారు.

అంతేకాదు, ప్రతిపక్ష పార్టీలు, వైరి వ‌ర్గాల వారిని వారి సిద్ధాంతాలు, నిర్ణ‌యాలు, ప‌ని తీరు ఆధారంగానే విమర్శిద్దామ‌ని కేటీఆర్ పిలుపునిచ్చారు. మరి, కేటీఆర్ పిలుపుతో టీఆర్ఎస్ శ్రేణులు, కేటీఆర్, కేేసీఆర్ అభిమానులు సైలెంట్ అవుతారా లేదంటే అదే దూకుడును కొనసాగిస్తారా అన్నది తేలాల్సి ఉంది. వాస్తవానికి ఒక్క టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలే కాదు…మిగతా పార్టీల నేతలు, కార్యకర్తలు కూడా వైరి వర్గ నేతలు, వారి కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న వైనం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనతో వారిలో కూడా మార్పు వస్తుందేమో వేచి చూడాలి.

Tags: ktr ankle injuryktr's urge to trs cadreminister ktrno personal commentstrolling on ys sharmilays sharmila
Previous Post

జగన్ కి అడ్డు అదుపు లేకుండా రుణాలు మంజూరు వెనుక భైరాగుల కుట్ర?

Next Post

జగన్ పై ఫిల్మ్ ఛాంబర్ షాకింగ్ కామెంట్స్

Related Posts

Movies

Mahesh birthday : పిల్లలకు ప్రాణం పోస్తున్న శ్రీ‌మంతుడు

August 9, 2022
Andhra

ఢిల్లీ లో వెంక‌య్య త‌రువాత ఎవ‌రు ?

August 9, 2022
Trending

రోజాకు జనసేన నేతల వార్నింగ్

August 8, 2022
Trending

పవన్ కు మంత్రి ధర్మాన ఛాలెంజ్

August 8, 2022
Trending

బాబు పాలకుడు…జగన్ పాలెగాడు..వైరల్

August 8, 2022
Movies

సెక్స్ లైఫ్ పై తాప్సీ షాకింగ్ కామెంట్స్

August 8, 2022
Load More
Next Post

జగన్ పై ఫిల్మ్ ఛాంబర్ షాకింగ్ కామెంట్స్

Comments 1

  1. Pingback: షర్మిల దెబ్బకు దిగొచ్చిన కేటీఆర్ - TodayNewsHub

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • Mahesh birthday : పిల్లలకు ప్రాణం పోస్తున్న శ్రీ‌మంతుడు
  • ఢిల్లీ లో వెంక‌య్య త‌రువాత ఎవ‌రు ?
  • రోజాకు జనసేన నేతల వార్నింగ్
  • పవన్ కు మంత్రి ధర్మాన ఛాలెంజ్
  • బాబు పాలకుడు…జగన్ పాలెగాడు..వైరల్
  • సెక్స్ లైఫ్ పై తాప్సీ షాకింగ్ కామెంట్స్
  • మోడీ ఇలాకాలో ‘రౌడీ’ కి ఇంత క్రేజా?
  • కుల చిచ్చు రేపిన గోరంట్ల కామెంట్స్
  • అమరావతిపై సుప్రీం కోర్టు తలుపుతట్టిన రైతులు
  • 2034 వరకు జగనే సీఎం? బాబుకు నో చాన్స్?
  • `బాటా` స్వ‌ర్ణోత్సవ వేడుక‌ల `కిక్ ఆఫ్ -గెట్ టుగెద‌ర్‌’ విజ‌య‌వంతం!
  • బాలినేనిని గిల్లిన పవన్ కల్యాణ్.. ఏంటి సంగతీ?
  • Allu Arjun: కళ్యాణ్ రామ్ అంటే నాకు ఎంతో గౌరవం
  • Samantha: ఆ విష‌యంలో ర‌ష్మిక ముందు స‌మంత కూడా దిగ‌దుడుపే!
  • కేసీఆర్ కి పంచ్ పడింది !

Most Read

ఏకాంత భేటీలో చంద్రబాబుతో మోదీ ఏం చెప్పారు?

గోరంట్ల వీడియో లీక్ వెనుక వైసీపీ నేతలు?

‘బింబిసార’ ఫస్ట్ రివ్యూ..మంట పుట్టిందట

జగన్ కు ‘షాక్’ ఇచ్చేలా విద్యుత్ ఉద్యోగి స్పీచ్..వైరల్

బాబు పాలకుడు…జగన్ పాలెగాడు..వైరల్

అంబటికి చుక్కలు చూపించారుగా!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra