చంద్రబాబు వైజాగ్ పర్యటన తెలుగుదేశం శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. ఒకవైపు రాజధాని అంటూ జగన్ తప్పటడుగులు వేస్తూ లోపాయకారిగా వైజాగ్ కి గుండె వంటి ఉక్కు పరిశ్రమను ప్రైవేటుకు కట్టబెట్టే యజ్జంలో భాగమై బీజేపీకి జై కొడుతున్న జగన్ పై వైజాగ్ ప్రజల కోపం ప్రస్పుటంగా కనిపించింది.
మరోవైపు వైజాగ్ బాబు ఉన్నపుడు, లేనపుడు అన్న తేడాను స్పష్టంగా చూస్తోంది. అంతర్జాతీయ సదస్సులు, కళకళలాడే టూరిజం, కొత్త ప్రాజెక్టులు, కొత్త ఉద్యోగాలతో కళకళలాడిన వైజాగ్ కళ కోల్పోయింది. గత ఎన్నికల్లోను వైజాగ్ నగరం బాబుకే పట్టం కట్టినా ఇతర ప్రాంత ప్రజలు నిర్ణయం, జనసేన ఓట్ల చీలికలతో జగన్ గద్దెనెక్కాడు.
కానీ జగన్ గద్దెనెక్కిన క్షణం నుంచి నేటి వరకు వైజాగ్ తన ప్రభను కోల్పోయింది. కబ్జాల బాధ పెరిగింది. ఖాళీ స్థలాలకు రక్షణ లేదు. కడప రాజ్యం, బెదిరింపులు చాలా కామన్ అయిపోయాయి వైజాగ్ లో. ఆ కసి కడుపు నిండా ఉందేమో వైజాగ్ ప్రజలు చంద్రబాబు యాత్రకు బ్రహ్మరథం పట్టారు. ఆ స్పందనను కళ్లతోనే చూడాలి.