జగన్.. రాష్ట్రం నీ తాత జాగీరా?.ఏపీలో ఎమర్జెన్సీ విధించావు – Nara Chandrababu Naidu #CBNInKuppam#EmergencyInAP#JaganPaniAyipoyindhi#JaganFailedCM #APvsJagan#PsychoPovaliCycleRavali#IdhemKarmaManaRashtraniki pic.twitter.com/RXUaYpPKVO
— AbdulRajak (@AbdulRa99443551) January 7, 2023
టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనముగిసింది. బుధవారం ప్రారంభమైన ఈ పర్యటనపై చంద్రబాబు సహా.. టీడీపీ నాయకులు చాలానే ఆశలు పెట్టుకున్నారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి నినాదంతో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల నేపథ్యంలో కుప్పంలో చంద్రబాబు పర్యటిం చాలని నిర్ణయించుకుని.. వారం ముందుగానే సమాచారం చేరవేశారు.
అయితే.. ఈ పర్యటన ప్రారంభం నుంచి పోలీసులు వర్సెస్ చంద్రబాబు మధ్య తీవ్ర మాటల యుద్ధం.. అడ్డంకులు.. అడ్డగింతలు కూడా చోటు చేసుకున్నాయి. మొత్తంగా మూడు రోజుల్లో చంద్రబాబు చేయాలని అనుకున్న పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు.. వివాదాలకు కేంద్రంగా మారింది. కనీసం చైతన్య రథాన్ని సైతం వదలకుండా..పోలీసులు దానిని స్టేషన్కు తరలించడం గమనార్హం.
ఈ నేపథ్యంలో కనీసం.. చైతన్య రథాన్ని ఇచ్చినా.. తన మానాన తను ప్రజల్లోకి వెళ్తానన్నా.. సర్కారు పెడచెవిన పెట్టింది. మొత్తంగా చూస్తే.. చంద్రబాబు లక్షిత మూడు రోజుల పర్యటన అయితే ముగిసింది. కానీ.. అసలు లక్ష్యం మాత్రం అలానే ఉండిపోయింది. ప్రజలను కలుసుకోలేక పోయారు. తను చెప్పాలనుకున్నది చెప్పుకోలేక పోయారు. చేయాలనుకున్నది చేయలేకపోయారు.
సో.. మొత్తంగా చూస్తే.. కుప్పం పర్యటన కొన్ని వివాదాలు.. మరికొన్ని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతోనే గడిచిపోయింది. ఈ పరిణామం లైట్ తీసుకుంటే.. ఇప్పటితో… ఇక్కడితో అయిపోయిందని టీడీపీ నేతలు భావిస్తే.. కష్టమేనని పార్టీ అభిమానులు చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి నిర్బంధాలు కామనే. సో.. వీటిని ఎదిరించేందుకు.. ఉమ్మడి ఐక్య ఉద్యమాల రూపకల్పన సాగితేనే టీడీపీ లక్ష్యం నెరవేరుతుందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.
ఈ రాష్ట్రంలో YS Jagan Mohan Reddy ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టే Nara Chandrababu Naidu సభలకు బ్రహ్మరథం పడుతున్నారు – కొడాలి నాని. pic.twitter.com/zAaU4AgF31
— Varun ఉవాచ (@VKsaysso) January 2, 2023