ముఖ్యమంత్రి జగన్ ని గాని, ఆయన పార్టీ నేతలను గాని ఒక ఆట ఆడుకోవాలంటే అది అయ్యన్నకే సాధ్యం… ఆయన కామెంట్స్ ఇటీవల బాగా వైరల్ అవుతున్నాయి. వైసీపీ నేతలకు వారి భాషలోనే సమాధానం చెప్పగలం తెలుగుదేశం నేతగా ఆయనను టీడీపీ క్యాడర్ కీర్తిస్తోంది.
ఏపీలో మంత్రులు ప్రెస్ మీట్ పెడితే అది కేవలం తెలుగుదేశం అధినేత చంద్రబాబును, ఆయన కొడుకును బూతులు తిట్టడానికి మాత్రమే అందరికీ తెలుసు. వారి నుంచి ఆ కంటెంట్ తప్ప మరేమీ జనం ఆశించడం లేదు.
మంత్రుల బాధ్యతలన్నీ వైసీపీ నెం.2 సజ్జలరామకృష్ణా రెడ్డే చూస్తారని ఇపుడు రాష్ట్రం మొత్తానికీ బాగా తెలుసు. దాంతో మంత్రుల ప్రెస్ మీట్లు చూడటం జనం మానేశారు.
తాజాగా వైసీపీ నేతల బూతులపై అయ్యన్న అదిరిపోయే కామెంట్లు చేశారు.
విజయసాయిరెడ్డి పందిరేస్తే తొండెళ్లి తోసిందట అలా వుంది భాషపై శ్రీ(ఏ2)రెడ్డి ఆవేదన అని అయ్యన్న విమర్శించారు. లోకేష్ భాష అసభ్యంగా ఉందని తీవ్ర మనోవేదన చెందిన శ్రీ(ఏ2)రెడ్డి గారు … మీ నేతలు ద్వారంపూడి, కొడాలి నాని, జోగి రమేష్ బూతుల కూతలు ఏనాడూ వినలేదా? నారా లోకేష్ మీ నాన్న ఉన్నారా ? అని అడిగితే… కొడాలి నాని నీ అమ్మ మొగుడు ఉన్నాడా అని అడుగుతున్నాడు.
ఏది బూతు? ఏది అసభ్యం? మీనేతల బూతులు, రోత చేష్టలు, కామలీలు, చూసిన జనం మీ పార్టీ పేరే మార్చారు. మీది యువ (Y) శృంగార(S) రసిక(R) బూతు(B) పార్టీ (P) అనుకుంటున్నారు అని అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ నేతల ప్రెస్ మీట్ వస్తుందటే జనం భయపడి టీవీలు కట్టేసే పరిస్థితి ఉందని అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు.
https://www.youtube.com/watch?v=dRe77gq5rjA&ab_channel=ABNTelugu
నమస్తే ఆంధ్రలో వచ్చే ఆసక్తికరమైన అప్ డేట్ల కోసం ఇక నుంచి మీరు గూగుల్ న్యూస్ లో నమస్తే ఆంధ్రను ఫాలో అవ్వచ్చు.